Do you have own blog? Then why don’t your customize it as per your needs? In this video demonstration I explained how to setup your own favicon which reflects your identity for your blog. Hookup speakers and listen while watching this video.
Nallamothu Sridhar
బ్లాగులున్న వాళ్లు వాటిని తమకు తగ్గట్లు డిజైన్ చేసుకోవడం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అవి పేలవంగా కన్పిస్తూ ఉంటాయి. టెంప్లేట్ ఒక్క దాన్ని అందంగా ఉన్నది అమర్చుకుంటే సరిపోదు.
మన బ్లాగ్ ఓపెన్ చేయబడినప్పుడు అడ్రస్ బార్ లో మన బ్లాగ్ అడ్రస్ పక్కన e అనే రెడ్ కలర్ సింబల్ అసహ్యంగా కన్పిస్తూ ఉంటుంది గమనించారా? ఆ e సింబల్ బదులు మీ పేరులో మొదటి అక్షరాన్ని మీకు నచ్చినట్లు డిజైన్ చేసుకుని పెట్టుకుంటే ఇక మీ బ్లాగ్ చూసే ప్రతీ ఒక్కరికీ ఆ ఐకాన్ ని చూడగానే మీ ప్రత్యేకత తెలిసిపోదూ..?
వినడానికి బాగానే ఉంది.. ఇలా ఎలా అమర్చుకోవడం అని సందేహిస్తున్నారా? అయితే ఈ వెంటనే ఈ వీడియో చూసేయండి. 4 నిముషాల్లో ఈ చిన్న టెక్నిక్ మీకు అర్థమైపోతుంది. మీ బ్లాగ్ కి ప్రత్యేకతను సంతరించుకోవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్