వాట్సప్ అతి త్వరలో GIF ఏనిమేషన్లని కూడా సపోర్ట్ చెయ్యబోతోంది. ఇప్పటివరకూ ఏదైనా ఏనిమేటెడ్ GIF ఫైల్‌ని వాట్సప్ ద్వారా ఛాట్ చేసే సమయంలో మన మిత్రులతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఏనిమేషన్ కాస్తా కదలకుండా ఉండే ఓ మామూలు ఇమేజ్ రూపంలో చూపించబడేది. అయితే వాట్సప్ 2.16.7.1 Beta వెర్షన్‌లో GIF ఏమినేషన్ల యొక్క లింకులను వాట్సప్‌లో షేర్ చేసుకున్నప్పుడు అవి ప్రత్యేకంగా బయటి బ్రౌజర్‌కి వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే ఏనిమేట్ అయి కన్పించబోతున్నాయి.
ఒక్కసారి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే గనుక ఈ క్రింది వీడియోలో లో కన్పించిన విధంగా మన రకరకాల మూడ్స్‌కి తగ్గట్లు Giphy ఏనిమేషన్లని వాట్సప్ ద్వారా మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. గత కొద్దికాలంగా వాట్సప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలు ప్రవేశపెట్టబడుతూ ఉన్నాయి.
కొన్ని నెలల క్రితం వరకూ కేవలం ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్‌ని మాత్రమే వాట్సప్ ద్వారా షేర్ చేసుకునే అవకాశం లభించేది. అయితే ఇటీవల PDF, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ ఫార్మేట్లకి చెందిన ఫైళ్లని కూడా మనం ఇతరులతో ఛాట్ చేసే సమయంలో పంచుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా అందుబాటులోకి రానున్న GIF ఏనిమేషన్ల సపోర్ట్ మన ఛాట్ సంభాషణల్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. ఈ Beta వెర్షన్ అందరికీ అందుబాటులోకి రావలసి ఉంది.