Most of the Home PC users face problems with sexually explicit content displayed with Google search results. Google offers us most powerful filters to stop this type of content. In this video tutorial I explained how to use “Lock Safe Search” option in order to get decent search results.
మీ పిల్లలకు గూగుల్ అశ్లీల సెర్చ్ ఫలితాలు చూపించకుండా ఇలా లాక్ చేసుకోండి..
మీరు చిన్న పిల్లలకు కంప్యూటర్ నేర్పిద్దామని గూగుల్ ఓపెన్ చేశారుకుందాం.
“Google Imagesలో ఇలా ఫొటోలు వెదుక్కోవచ్చు” అంటూ ఓ పదం టైప్ చేసి వెదగ్గానే ఆ వచ్చిన ఫొటోల్లో అశ్లీలమైనవి సైతం వచ్చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది?
గూగుల్ కి కంప్యూటర్ ముందు కూర్చున్నది చిన్న పిల్లలో, పెద్ద వాళ్లో తెలియదు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోపోతే అది అశ్లీల వెబ్ సైట్లూ, నగ్న/అశ్లీల ఫొటోలను సైతం చూపిస్తుంటుంది. చిన్న పిల్లలున్న కుటుంబాల్లో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి! సో ఇలాంటప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఓ చిన్న సెట్టింగ్ చేసుకోవడం ద్వారా ఇకపై గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఎలాంటి అసభ్య ఫొటోలూ, సమాచారం చోటు చేసుకోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కంప్యూటర్లు వాడే ప్రతీ కుటుంబానికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ పంచుకుని వారినీ కాపాడండి.