In India, we are all movie lovers. We love movie stars, we wait for new movie tickets in bigger ques. Finally we wish to watch that newly released movie as early as possible. We can book movie tickets online with the help of number of third party services.
In this video demonstration I explained one such service which provides movie tickets for Hyderabad and Warangal cities. It offers Telugu, Hindi, English movies which are now running in major theatres of the cities. You just need internet banking or debit card or Credit card in order to book tickets. You can choose the available seats, you can filter date, show timings etc.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మనం సినిమాలంటే పడి ఛస్తాం….
సినిమా రిలీజైన మొదటి 2 మూడు రోజుల్లో ఎలాగైనా చూసి తీరాల్సిందే….
తీరా థియేటర్ దగ్గరకెళ్లి క్యూలో నిలబడితే పదీ, ఇరవై మందికి టిక్కెట్లు ఇచ్చేసి… కౌంటర్ క్లోజ్ చేసేస్తారు…. మిగతా టిక్కెట్లన్నీ పక్కనే రూ. 50ది 150కీ, 200కీ బ్లాక్‌లో అమ్మబడుతూ ఉంటుంది…. అంత కష్టపడి అంత దూరం వెళ్లీ తప్పదు కాబట్టి బ్లాక్‌లో కొనీ చూసేయడం చాలామందికి అలవాటైపోయింది.
కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవారు Easy Movies వంటి సర్వీసుల ద్వారా దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్‌కెళ్లి ఫొటో దిగి టిక్కెట్లు బుక్ చేసేసుకుంటున్నారు…. అస్సలు అంత శ్రమ కూడా ఎందుకు?
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరే నేరుగా ఆన్‌లైన్‌లో మీకు దగ్గరలోని ఏ థియేటర్‌కైనా ఏ సినిమాకైనా, ఏ షోకైనా…. 24 గంటల్లో మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు…. దీని కోసం ఇంటర్నెట్ సెంటర్లకి పరిగెత్తాల్సిన పనిలేదు.
కొన్ని సర్వీసులు బిగ్ సినిమాస్, ప్రసాద్ ఐమాక్స్ వంటి స్క్రీన్లకి ఈ మాదిరి సదుపాయం కల్పిస్తున్నా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న చిన్న థియేటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే మాత్రం ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది….
సో మీ అభిమాన హీరోల సినిమాలు చూడ్డానికి ఇక పెద్ద కష్టాలేమీ ఉండదు….
గమనిక: ప్రతీ మూవీ లవర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్