If you are planning to visit Tirumala for Lord Venkateswara Darshan, you no need to worry about Dhashan and Accommodation tickets.
By following this video demonstration you can easily book Darshan, accommodation, Kalyanotsavam, Suprabhatam, Thomala Seva, Archana, Visesha Pooja, Astadala Pada Padmaradhanamu, Vasanthotsavam, Nijapada Darshanam etc.
tickets online. Just you need internet connection, and small photo for identification.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి టిక్కెట్లు మీ పిసి నుండే బుక్ చేసుకోవడం ఇలా…
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..
శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం, నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది. అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు
ప్రింటౌట్లు తీసుకుని వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.
గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం కలగడానికి మీ వంతు సహకరించగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్