Vajrasana is called as King of all Yogasanas. It can be used any time around the clock. There are no restrictions for any age group. Along with the body, the mind also gets stabilized in this Asana. Hence, it is preferred for meditation and concentration. This Asana is also found to be good for Pranayama.
The special fold of the legs forms one Bandha in this Asana. Consequently the blood circulation in the waist-downward parts is controlled.
In this video I demonstrated entire procedure of Vajrasana and explained it’s health benefits.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంచే వజ్రాసనం ఇలా వేయాలి.. ప్రాక్టికల్ డెమో….
శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం ఏదైనా ఉందంటే అది వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది….
మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు.
ఈ ఆసనంలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టివి చూడొచ్చు, పుస్తకాలు చదవొచ్చు… మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు….
రోజుకి కనీసం ఓ అరగంట పాటైనా నేను ఈ ఆసనంలో కూర్చుంటాను..
ఈ వజ్రాసనాన్ని ఎలా వేయాలి, దీని వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలేమిటి.. అన్నది ఏమాత్రం యోగాపై అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యేలా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్