మీ కంప్యూటర్‌ని ఇతరులు యాక్సెస్ చేయకుండా Pen Driveతో ఇలా లాక్ చేసుకోండి
వీడియో లింక్ ఇది:
మీరు కాసేపు మీ లాప్‌టాప్, కంప్యూటర్‌ని వదిలిపెట్టి పక్కకు వెళితే ఇతరులు మీ పిసి వాడేసుకోకుండా లాక్ చేసుకోవాలంటే మీ పెన్‌డ్రైవ్‌ని లాక్‌గా సెట్ చేసుకోవచ్చు.
అంటే మీరు USB పోర్ట్‌కి మీ పెన్‌డ్రైవ్ గుచ్చినంత సేపు పిసి స్క్రీన్ కన్పిస్తుంది.. మీరు టీ తాగడానికో, టివి చూడడానికో పక్కకు వెళుతూ pen drive పీకేసి జేబులో వేసుకు వెళ్లారనుకోండి.. మీ లాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఎవరూ దాన్ని వాడలేరు. మీరు తిరిగి వచ్చాక మళ్లీ మీ pen drive గుచ్చితే స్క్రీన్ ఆన్ అయిపోయి మీరు పని కంటిన్యూ చేసుకోవచ్చు.
చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. అయితే ఈ టెక్నిక్ ప్రాక్టికల్‌గా ఎంత భేషుగ్గా పనిచేస్తోందో మీరే ఈ వీడియోలో చూసి మీరూ ఫాలో అయిపొండి.
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com