We share internet connection with Wireless routers to devices like PC, Laptop, Mobile Phone, Smart TV, Tablets etc.
Without password security our Wi-Fi routers behave like open connections which can be accessible by any nearby devices. Most of the pc users doesn’t know how to secure their Wi-Fi routers like NetGear, D-Link, Belkin etc.
There are number of security mechanisms to restrict unauthorised access. In this video demonstration I explained the need of password protection and differences betweens WEP, WPA-PSK, WPA2-PSK etc. By following this video end computer user can set password for their routers.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇంటర్నెట్ దొంగల నుండి మీరు కాపాడుకోలేరా?
అందరూ వై-ఫై ఫోన్లూ, టాబ్లెట్లూ, లాప్‌టాప్‌లూ కొంటున్నారు.. బానే ఉంది.
అలాగే తమకున్న ఏకైక నెట్ కనెక్షన్‌ని ఈ వీటన్నింటికీ పనిచేసేలా రూటర్‌లూ కొనేస్తున్నారు మంచిది.
దాంతో పనైపోయినట్లేనా?
మన ఇంటర్నెట్ కనెక్షన్‌ని పక్కింటోళ్లూ, మన రూటర్ నుండి ఎంత దూరం సిగ్నల్ వస్తే అంత దూరంలో ఉన్నోళ్లందరూ ఫ్రీగా వాడేసుకోవచ్చని తెలిసిన వారెంతమంది?
ఇక్కడ నేను అడ్వాన్స్‌డ్ యూజర్ల గురించి మాట్లాడట్లేదు… 90% మంది హోమ్ పిసి యూజర్లు BSNL వంటి కనెక్షన్లనీ, రూటర్లనీ వాడుతున్నారు. నెట్ చాలా స్లోగా వస్తోందని కంప్లయింట్లు చేస్తుంటారే తప్ప తమ నెట్ కనెక్షన్ దొంగతనంగా వాడుకోబడుతోందని తెలిసిన వారు అరుదు.
ఇటీవల ఓ BSNL కొత్త కనెక్షన్ రూటర్‌కి ఇతరులు దొంగతనంగా వాడుకోకుండా పాస్‌వర్డ్ పెట్టమని BSNL ఉద్యోగిని నాకు తెలిసిన వారు ఒకరు అడిగితే “తనకు తెలియదని” చేతులెత్తేశారు.
ఇంత చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడాల్సిన పనిలేకుండా ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారైనా తమ వైర్‌లెస్ రూటర్లకి పాస్‌వర్డ్‌లు సెట్ చేసుకుని దొంగల నుండి కాపాడుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరంగా చూపించాను. సో ఇది ఫాలో అయితే చాలు.
గమనిక: ఎంతోమంది పిసి యూజర్లకి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్