People complain that their anti virus softwares, internet security suites doesn’t detect any virus.. but their system becomes slow and behaves strangely.
All of the pc users must know one fact, some viruses resides in memory while windows boots. They cann’t be detected with standard anti virus tools. To detect and remove this type of viruses we need bootable Virus Rescue methods. In this video tutorial I presented the entire practical process. Please watch and share to your friends.
మీ ఏంటీ వైరస్ వైరస్ లు లేవనే చెబుతున్నా.. సిస్టమ్ స్లోగా ఉందా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!
మనలో ప్రతీ ఒక్కరం Kaspersky, Norton, McAfee వంటి శక్తివంతమైన ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు ఎన్నింటిలో వాడుతూనే ఉంటాం. ఎప్పటికప్పుడు వాటితో కంప్యూటర్ మొత్తాన్నీ స్కాన్ చేస్తూనే ఉంటాం. అవి బుద్ధిమంతులలాగా “మీ పిసి క్లీన్ గా ఉంది..” అని సర్టిఫికెట్ మరీ ఇచ్చేస్తుంటాయి.
అయినా కంప్యూటర్ స్లోగా ఉంటుంది. కంప్యూటర్ స్లో అవడానికి సవాలక్ష కారణాలనుకోండి. కానీ ఖచ్చితంగా మీ కంప్యూటర్లో వైరస్ ఉన్నా ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు గుర్తించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వీడియోలో నేను ప్రాక్టికల్ గా చూపించిన పద్ధతితో మీ కంప్యూటర్ ని స్కాన్ చేయండి, ఏ మూలన ఏ వైరస్ దాగి ఉన్నా ఇట్టే తుడిచిపెట్టుకుపోతుంది. నాదీ గ్యారెంటీ.
నల్లమోతు శ్రీధర్