Regularly I am getting messages from Computer Era Magazine readers asking about how to root Android phones and tablets. Every mobile phone manufacturer like Samsung, Sony, HTC, Micromax, Celkon etc.. locks the file system in order to protect unwanted changes. That means we cann’t access internal file system directly.
In this context I demonstrated how to root Android phones in this video. I used Samsung Galaxy Fit S5670 for the demo purpose. By rooting the device you can take control the interal file system and uninstall unwanted softwares from mobile manufacturers, you can install your desired fonts, you can adjust screen density and other system settings.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా? అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు. కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా “రూటింగ్”ని పేర్కొనవచ్చు.
ఇప్పటికి కొన్ని వందల మంది “కంప్యూటర్ ఎరా” మేగజైన్ రీడర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లని రూట్ చేయడం గురించి వీడియో చేయమని అడుగుతూ వచ్చారు..
మిగతా వీడియోల్లా ఇది ఒక్కడినే షూట్ చేసుకోవడం కుదరని పని కావడం వల్ల, చాలా శ్రమతో కూడిన వ్యవహారం అవడం వల్ల వాయిదా వేస్తూ వచ్చాను. ఇన్నాళ్లకు చాలా శ్రమించి ఈ వీడియో చేశాను.
ఇప్పుడు ఈ వీడియోలో ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి సైతం అర్థమయ్యేలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఫోన్లని రూట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది.
తదుపరి వీడియోల్లో root చేసిన ఫోన్‌ని unroot చేయడం ఎలాగో, అలాగే వాటిలో custom ROM వేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపిస్తాను.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్