We invest thousands of rupees for new laptops. We cann’t decide which model and which brand is better. Always we depend on friends advice and suggestions for new purchases. There are number of notebook brands and models available in market. It’s not easy to select perfect one for our needs. But there is an easy way to get correct model which fits for our purpose.
In this video demonstration I introduced one website which provides laptop purchase guidance.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
చేతిలో 25-30 వేలైతే రెడీగా ఉంటాయి కానీ… ఏ లాప్‌టాప్ కొనాలో మనకు అస్సలు అర్థం కాదు…
ఏదో ఒకటి కొనేస్తే కాస్త కొత్త మోజు తీరుతుందన్న ఆత్రుతతో షాప్‌కెళ్లి అక్కడ సేల్స్‌మెన్ గొప్పగా చెప్పే మోడల్ కొనేసి వచ్చేస్తుంటాం…
చాలా అరుదుగా మాత్రమే ఏది కొంటే బెటర్ అని ఆలోచించే వాళ్లుంటారు.. అలా అలోచించే కొంత మంది “కంప్యూటర్ ఎరా” రీడర్స్ తరచూ నన్ను లాప్‌టాప్ కొనుగోలు విషయంలో సలహాలు అడుగుతుంటారు.. అయితే నాకు ప్రతీ ఒక్కరికీ పర్సనల్‌గా గైడ్ చేసే టైమ్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఆన్సర్
చెయ్యలేకపోతాను…
ఇంతకీ విషయం ఏమిటంటే… మీరు గనుక కొత్త లాప్ టాప్ కొనాలనుకుంటే ఇకపై నాలాంటి ఎవ్వరిపై ఆధారపడాల్సిన పనిలేదు… ఈ వీడియో చూశారంటే ఎవర్నీ అడక్కుండానే మీకు కావలసిన మోడల్ ఏమిటో డిసైడ్ చేసేసుకోగలుగుతారు.
వివిధ అవసరాలకు, వివిధ ధరల్లో లభిస్తున్న అన్ని కంపెనీలకు చెందిన మోడళ్ల వివరాలు 2 నిముషాల్లోపు తెలుసుకోవచ్చు…
సో బోల్డంత డబ్బు పోసి… నాసిరకం మోడళ్లు కొనే బదులు ఈ వీడియో చూసి మీకు సూట్ అయ్యే మోడల్ ఎంచుకోండి…
అలాగే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్