Limited amount of memory leads to slow PC performance. People no need to purchase additional memory (RAM modules) in order to increaste their computer performance. With the technique I explained in this video i.e. Windows ReadyBoost, if you have a flash drive ( like a USB thumb drive or an SD card ) you can just use this to make your computer run better with Windows 7 and Windows Vista. You simply plug in a flash drive and Windows 7 will use Windows ReadyBoost to utilize the flash memory to improve performance.
మీ కంప్యూటర్ స్లోగా ఉన్నా సర్ధుకుపోతున్నారా? దాన్నెందుకు వేగంగా మార్చుకోకూడదు?
నాలుగు ప్రోగ్రాములు ఓపెన్ చేయగానే మెల్లగా రెస్పాండ్ అవుతుండే కంప్యూటర్ ని గానీ, లాప్ టాప్ ని గానీ వేగంగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరిస్తున్నాను.
కంప్యూటర్లు స్లోగా పనిచేయడానికి తక్కువ మెమరీ ఉండడం ఓ కారణం. అలాగని అర్జెంటుగా మీరు మెమరీ కొని వేసుకోవలసిన పనిలేదు. మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నే తాత్కాలికంగా RAMగా వాడుకునే ఓ పద్ధతిని ఇందులో వివరిస్తున్నాను. దీంతో 1GB, 2GB వంటి పరిమిత మొత్తంలో RAM ఉన్న వారు తప్పకుండా పనితీరులో మెరుగుదల చూస్తారు. 4GB కన్నా ఎక్కువ RAM ఉన్న వారికి ఈ టెక్నిక్ పెద్దగా ఉపయోగపడదనుకోండి. దాదాపు 85% కంప్యూటర్లలో 2GBకి మించి మెమరీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నిక్ మీకూ పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్