Start…. Ready.. Click…. this is the sequence how we capture Photos…
My new sequence is Start.. Ready.. Clap your Hands to take Snaps..
It will be more interesting if you watch the practical demo I shooted in this video.
Most of us have advanced mobile phones like Samsung Sony HTC Android OS based phones with powerful front back camera facility. We can do wonders by using third party professional Camera Softwares.
In this video demonstration I introduced one excellent photo capture solution for Android mobiles.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీరు చాలా బాగా రెడీ అయిపోయారు.. ఒక ఫొటో దిగితే బాగుణ్ణు అన్పించిదనుకోండి….
చాలామంది కెమెరాని ఫేస్ వైపు తిప్పుకుని చేతులు చాపుకుని ఫొటోలు తీసేసుకుంటారు… భుజాలు ముందుకు సాగిపోయి అలాంటి ఫొటోలు ఎబ్బెట్టుగా వస్తుంటాయి…
అలా కాకుండా ఫోన్ ని ఓ చోట పెట్టేసి.. మీరు కావలసిన చోటికి వెళ్లి నిలబడి… అంతా ఓకే అనుకున్న తర్వాత చిన్నగా చప్పట్లు కొడితేనో… లేదా Take Photo అని చిన్నగా మాట్లాడితేనో ఫొటో తీసేయబడితే బాగుంటుంది కదా?
ఇదెంత అద్భుతంగా పనిచేస్తుందో మీ కోసం నేను ప్రాక్టికల్ గా అలా ఫొటో దిగి మరీ చూపించాను, ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీసిన ఫొటోలకు క్షణాల్లో అద్భుతమైన స్పెషల్ ఎఫెక్టులు కూడా జత చేసుకోవచ్చు.
ఎవరితో పనిలేకుండా స్వంతంగా ఫొటోలు తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్