In my previous video I demonstrated how to root Android phones in order to access file system and install advanced softwares.
Most of the people fear about warrenty while rooting phones. You can follow simple trick here, by unrooting your device you can get full warrenty from the phone manufacturer like Samsung, Sony, HTC etc.
In this video I demonstrated how to unroot rooted phone, I used Samsung Galaxy Fit S5670 model for this purpose. The procedure may differ according to your model and root method you followed earlier.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఆండ్రాయిడ్ ఫోన్లని Unroot చేసుకోవడం ఇలా..
వారెంటీ ఎక్కడ పోతుందో అని చాలామంది ఫోన్లని రూట్ చెయ్యడానికి భయపడుతుంటారు. సర్వీస్ సెంటర్‌కి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఫోన్‌ని unroot చేసి తీసుకు వెళితే ఖచ్చితంగా పూర్తి వారెంటీ లభిస్తుంది.
దీనికి best example నా Samsung Galaxy Note I. దాదాపు ఓ 20 సార్లు నా ప్రయోగాల్లో భాగంగా root, unroot చేసిన తర్వాత ఫోన్‌ని power button సమస్య వల్ల సర్వీస్ సెంటర్‌కి తీసుకు వెళ్లాల్సిన పని పడింది. నేను అన్నిసార్లు రూట్ చేసినా.. ఆ ఫోన్ నేను తీసుకు వెళ్లిన సమయంలో unroot చెయ్యబడి ఉండడం వల్ల మారు మాట్లాడకుండా సర్వీస్ సెంటర్ వాళ్లు రిపేర్ చేసి ఇచ్చారు.
ఫోన్ రూటింగ్ విషయంలో చాలా అపోహలూ ఉన్నాయి.. భయాలూ ఉన్నాయి.. అందువల్లే చాలామంది ముందుకు రాలేకపోతున్నారు.
అందుకే గత వీడియోలో నేను ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఎలా రూట్ చెయ్యవచ్చో చూపించాను. ఈ వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot
ఈ వీడియోలో నేను అదే ఫోన్‌ని ఎలా unroot చేసుకోవచ్చో చూపిస్తున్నాను.
గమనిక: ప్రతీ మొబైల్ యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్