Usually email users neglect their security habits. Because of this most of the Email IDs will be compromised. Hackers hack them and uses them for their spamming etc.. In this video tutorial I explained how to protect your Gmail ID by enabling 2-Step Verification. With this process nobody cann’t hack your pc. Hookup your speakers and watch this.
15% మంది Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉంటున్నాయి.. ఇలా చేస్తే అస్సలు ఎవ్వరూ మీ అకౌంట్ హ్యాక్ చెయ్యలేరు..
పాపం చాలామంది పిసి యూజర్లకి తమ Gmail అకౌంట్లు హ్యాక్ అయి ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే వాడేసుకుంటూ ఉంటున్నారు. “కంప్యూటర్ ఎరా” మేగజైన్ రీడర్స్ అనేకమంది తమ మెయిల్ ఐడి నుండి తమకు తెలియకుండానే మెయిల్స్ వెళ్తున్నాయని తరచూ వాపోతూ ఉంటారు. ఇదే పరిస్థితి చాలామందికీ తలెత్తుతుంది. కొందరు గుర్తిస్తారు. కొందరు తమ అకౌంట్ హ్యాక్ అయిందన్న విషయం కూడా తెలియకుండానే గుడ్డిగా వాడేస్తూ పోతారు.
Gmail అకౌంట్లు వాడే వాళ్లు కేవలం యూజర్ నేమ్, పాస్ వర్డ్ లతో మాత్రమే కాకుండా మొబైల్ నెంబర్ కి పంపించబడే వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేస్తేనే మన అకౌంట్ లోకి లాగిన్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్తగా ఈ మొబైల్ వెరిఫికేషన్ కోడ్ వల్ల అదనపు సెక్యూరిటీ లభిస్తుంది. ప్రపంచంలో ఏ గొప్ప హ్యాకరూ మీ అకౌంట్ ని హ్యాక్ చెయ్యలేరు. ఈ పద్ధతిని ఎనేబుల్ చేసుకోవడం ఎలాగో వివరంగా మీకు ఈ వీడియోలో చూపించాను. ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ పంచుకోగలరు.
నల్లమోతు శ్రీధర్