We can attach number or photos in order to achieve panoramic view. In this video I explained this procedure which can be adoptable in few minutes.
మీ కెమెరాతో ఇల్లు మొత్తాన్నీ అన్ని కోణాల్లో ఒకటే ఫొటోగా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను చూపించినట్లు చేయండి..
మీరు ఓ కలర్ ఫుల్ గార్డెన్ లో ఉన్నారనుకుందాం. గార్డెన్ మొత్తం మీకు విపరీతంగా నచ్చేసినా మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో గార్డెన్ లోని కొద్ది కొద్ది భాగాలను మాత్రమే ఫ్రేమింగ్ చేసుకుని ఫొటోలు తీసుకోగలుగుతారు కానీ ఆ కెమెరాతో గార్డెన్ మొత్తాన్నీ 360 డిగ్రీల కోణంలో షూట్ చెయ్యలేరు కదా?
మరో ఎగ్జాంపుల్ చెబుతాను.. మీరు కొత్తగా ఓ ఇల్లు కట్టుకున్నారనుకుందాం. ఇంటి మొత్తాన్నీ అన్ని కోణాల్లో వీడియో కాకుండా కేవలం ఫొటో ద్వారా సుదూరంలో ఉన్న మీ మిత్రులకు చూపించాలంటే ఏం చేస్తారు? ఇది హాల్.. ఇది మాస్టర్ బెడ్ రూమ్.. హాల్ పక్కనే కిచెన్ వస్తుంది.. అంటూ వేర్వేరు ఫొటోలను చూపిస్తూ వారికి అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తారా? దానికన్నా మీ పరిసరాలు ఏవైనా కానీయండి 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీన్ని చూస్తే మీరే 2 నిముషాల్లో మీ పరిసరాలను 360 డిగ్రీల కోణంలో ప్రజెంట్ చేయగలుగుతారు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్