PC users frequently formats system because of virus problems. No anti-virus software provide 100% protection. After watching this video you will be mentally free with virus and formatting problems. You need not to format your system anymore. Always your system is safe, clean and fast.
ఇక వైరస్ ల బాధ ఉండదు, ఫార్మేటింగ్ పనే లేదు.. ప్రతీ ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన ది బెస్ట్ సొల్యూషన్
ఎవర్ని కదిపినా మా కంప్యూటర్ లో వైరస్ ఉందేమో చాలా స్లో అయిపోయింది అనే కంప్లయింట్లే!
ఏంటీవైరస్ లను నమ్ముకోవడమూ శుద్ధ దండగే. అస్సలు మన కంప్యూటర్లోకి వైరస్సే రాకుండా కాపాడుకోలేమా?
చీటికీ మాటికీ హార్డ్ వేర్ టెక్నీషియన్ వచ్చి format చేస్తూ ఉంటే అతనికి ఓ 200 సమర్పించుకునే తిప్పలు తప్పవా?
కంప్యూటర్ ఎప్పుడూ ఫాస్ట్ గా, క్లీన్ గా ఉంచుకోవడం కుదరదా?
ఈ వీడియో చూడండి.. ఇక మీరు సంవత్సరాల తరబడి ఒక్క వైరస్ బారిన కూడా పడరు. నాదీ గ్యారెంటీ.
నా కంప్యూటర్లోకి వైరస్ అనేదే రాదు. అంతేకాదు నేను ఏదైనా విండోస్ కొత్త వెర్షన్ రిలీజైతే తప్ప చీటికీ మాటికీ వైరస్ ల కోసమని కంప్యూటర్ ని ఫార్మేట్ చేయాల్సిన అవసరమే పడదు.
నేను ఈ వీడియోలో చూపించిన చిన్న, ఉచిత పద్ధతి ఎంతో విలువైన మీ సమయాన్నీ, విలువైన మీ హార్డ్ డిస్కులోని డేటానీ కాపాడుతుంది.
ఇంట్లో కంప్యూటర్ ఉన్న వారి దగ్గర్నుండీ ఇంటర్నెట్ సెంటర్లూ, ఆఫీసులు కలిగి ఉన్న వారి వరకూ ఖచ్చితంగా దీన్ని ది బెస్ట్ మెథడ్ గా ఒప్పుకుని తీరతారు. ఇలాంటివే పలు పద్ధతుల గురించి మన కంప్యూటర్ ఎరా మేగజైన్ లో గతంలో వివరంగా చర్చించాను. కానీ అన్నింటికన్నా ఇది చాలా మెరుగైన విధానం.
ఆలస్యమెందుకు? మీ కంప్యూటర్ సమస్యలకు ఈ ఒక్క వీడియోతో ఛెక్ పెట్టేయండి మరి.
స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
నల్లమోతు శ్రీధర్