In recent times particularly in India most of the people believing that Android Tablet are best alternatives to regular Personal Computers. But this is not correct. We can perform serious tasks in these tablets. There are lot of limitations to them. If you want to do your regular office works or personal works on the move it is better to purchase Netbooks which are minimized models of Laptops.
Netbooks usually available in 10 inch size format. We can install Windows XP, 7, Windows 8 etc. and also we can install regular applications like Photoshop, Microsoft Office etc. They provide longer battery life approx. 5-7 hours.
In this video demonstration I discussed all these things and provided demo of my newly purchased Asus Eee PC 1015CX-WHI014W Netbook.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
వేలు ఖర్చుపెట్టి టాబ్లెట్లెందుకు దండగ?
టాబ్లెట్ కొంటే చాలు.. అన్ని పనులూ చేసేసుకోవచ్చని చాలామంది అనుకుంటున్నారు… మీడియాలోనూ, TV Adsలోనూ వచ్చే ప్రకటనలను చూసి, బయట జనాలు చెప్పేవి వింటూ కంప్యూటర్/ లాప్‌టాప్ అవసరం ఉన్న వాళ్లు కూడా చవకగా ఐదారు వేలల్లో టాబ్లెట్ కొంటే ఒక పనైపోతుంది అని
వీటినే కొనేస్తున్నారు 🙂 తీరా కొన్న తర్వాత బాధ పడుతున్నారు అది వేరే విషయం అనుకోండి.
ఐదారు వేలు పెట్టి చవక టాబ్లెట్‌నో, 17-25,000 పెట్టి ఖరీదైన ఆండ్రాయిడ్ టాబ్లెట్‌నో కొనే బదులు మీ కంప్యూటింగ్ అవసరాలకు రూ. 14 నుండి 22 వేల మధ్య లభించి నెట్‌బుక్‌లు ఎంత బాగా ఉపయోగపడతాయో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
నెట్‌బుక్‌లు ఇప్పుడు కొత్తేం కాదు… టాబ్లెట్ల ముందు అవే వెలుగు చూసింది… కాకపోతే టాబ్లెట్లకు విపరీతమైన పబ్లిసిటీ జరగడం, ఇతరత్రా కారణాల వల్ల ఎంతో ఉపయోగకరమైన అవి చాలామందికి తెలీకుండా పోయాయి.
నెట్‌బుక్‌లో Windows XP, 7, Windows 8లను వాడుకోవచ్చు.. ఫొటోషాప్ వంటివీ వేసుకోవచ్చు.. ఒక పూర్తి స్థాయి కంప్యూటర్ లానే వాడుకోవచ్చు.
నేను ఈ వీడియోలో చూపిస్తున్న Asus Eee PC 1015CX-WHI014W అనే నెట్‌బుక్ వేగం పరంగానూ, పెర్‌ఫార్మెన్స్ పరంగానూ ఏమాత్రం లాప్‌టాప్‌కి తీసిపోని విధంగా ఉంది.
సో టాబ్లెట్లు కొనాలా, నెట్‌బుక్‌లు కొనాలా అన్నది మీ నిర్ణయం… ప్లస్ మీ అవసరాన్ని బట్టి ఉంటుంది…!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్