• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Whatsappలో కొత్తగా రాబోతున్న రెండు సదుపాయాలివి!

by

Whatsappలో సుదీర్ఘకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న రెండు కొత్త సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. రెండూ కూడా అతి కీలకమైనవే.

Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhoneలకి మారే వారికి తరచూ ఏర్పడే అతి పెద్ద సమస్య iOSలో అప్పటి వరకూ ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ Androidలో రాకపోవడం, Androidలో ఉన్న ఛాట్ బ్యాకప్ iOSలోకి బదిలీ అవకపోవడం! దీని కోసం చాలామంది అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్స్ ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో Whatsapp అలాంటి ఇతర అప్లికేషన్స్ తమ నియమాలను ఉల్లంఘించాయని, అలాంటివాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ తనకు తానే స్వయంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది.

దీనిద్వారా ఇకమీదట మీరు Android phone నుండి iPhoneకి మారుతున్నా, iPhone నుండి Androidకి మారుతున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా అప్పటివరకు ఉన్న ఛాట్ బ్యాకప్ మొత్తాన్నీ కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

దీంతోపాటు కొంతమంది అధిక సమయం డెస్క్టాప్ కంప్యూటర్ మీద గడుపుతూ ఉండటం వల్ల Whatsapp Web ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వారు Whatsapp Webలో యాక్టివ్‌గా ఉండాలంటే వాట్సప్ ఇన్స్టాల్ చేయబడి ఉన్న మొబైల్ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. ఇక మీదట దీంతో సంబంధం లేకుండా, ఒకసారి ఒక నెంబర్ మీద వాట్స్అప్ వెబ్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఒకవేళ సంబంధిత ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్‌ నెట్‌కి కనెక్ట్ అయి లేకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాట్స్అప్ వెబ్ పనిచేసే విధంగా Whatsapp కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తోంది.

Whatsapp Beta వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అతి త్వరలో ఈ రెండు కొత్త సదుపాయాలు మొదట అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు ఇవి లభించటం జరుగుతుంది.

Filed Under: Tech News Tagged With: whatsapp Android iOS, whatsapp multiple devices support, whatsapp new features, Whatsapp web new features

Redmi Note 10 సేల్ ఈరోజు.. మరిన్ని వివరాలు ఇక్కడ!

by

redmi note 10 amazon sale

మొదటి నుండి Redmi Note సిరీస్ ఫోన్లకి వినియోగదారుల నుండి విపరీతమైన ఆదరణ ఉంటోంది. అదే క్రమంలో తాజాగా Redmi Note 10 కూడా హాట్ కేక్స్‌లా అమ్ముడవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు Amazon India సైట్లో ఈ లింకులో Redmi Note 10 అమ్మకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం … [Continue reading] about Redmi Note 10 సేల్ ఈరోజు.. మరిన్ని వివరాలు ఇక్కడ!

Filed Under: Tech News Tagged With: redmi note 10, redmi note 10 amazon sale, smartphone sale

మీ phoneలో Mobile Data సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించండి!

by

How to save mobile data on Android phone

ఊరికూరికే మీ mobile data ఖాళీ అయిపోతోందా? వాస్తవానికి మన ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్న కొన్ని అప్లికేషన్స్ మాత్రమే భారీ మొత్తంలో మొబైల్ డేటా వినియోగించుకుంటాయి. ఈ నేపథ్యంలో Android phoneలలో కొన్ని సెట్టింగ్స్ చేయటం ద్వారా మొబైల్ డేటా వినియోగం … [Continue reading] about మీ phoneలో Mobile Data సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించండి!

Filed Under: How-To Guide Tagged With: android phone, android tips, How to save mobile data on Android phone, smartphone mobile data

Whatsapp Backup ఇక మరింత పదిలం.. కొత్త ఫీచర్ తీసుకు వస్తున్న Whatsapp

by

Whatsapp Backup

కొంతకాలం క్రితం ముంబై డ్రగ్స్ కేసులో నిందితుల Whatsapp Backup ఆటోమేటిక్ గా Google Driveలో సేవ్ అవడం వల్ల పోలీసులు దాన్ని చేజిక్కించుకుని, ఆ ఛాట్ పబ్లిక్ లోకి రావడం తెలిసిందే. ఇలాంటివే ఇటీవల అనేక సందర్భాలు ఎదురవుతున్న నేపథ్యంలో Google Driveలో సేవ్ … [Continue reading] about Whatsapp Backup ఇక మరింత పదిలం.. కొత్త ఫీచర్ తీసుకు వస్తున్న Whatsapp

Filed Under: Tech News Tagged With: whatsapp chat backup, Whatsapp Google Drive iCloud Chat backup password protected, whatsapp new feature, whatsapp privacy, whatsapp security

టెంపరరీగా Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

by

Paid Android Apps Free on Google Play Store

Google Play Storeలో లభించే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తాయి. అందులో భాగంగా ప్రస్తుతం Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps వివరాలు ఇక్కడ చూద్దాం. Hairy Letters 280 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ ఇప్పుడు … [Continue reading] about టెంపరరీగా Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

Filed Under: Tech News Tagged With: android apps, android phone, free android Apps, google play store, Paid android apps free on Google Play Store

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 999
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsappలో కొత్తగా రాబోతున్న రెండు సదుపాయాలివి!
  • Redmi Note 10 సేల్ ఈరోజు.. మరిన్ని వివరాలు ఇక్కడ!
  • మీ phoneలో Mobile Data సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించండి!
  • Whatsapp Backup ఇక మరింత పదిలం.. కొత్త ఫీచర్ తీసుకు వస్తున్న Whatsapp
  • టెంపరరీగా Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in