ఆగస్టు 4న రాబోతున్న Redmi 9 phone స్పెసిఫికేషన్స్ ఇవి!

redmi 9 release date price specifications

Redmi Note 9ని విడుదల చేసిన ద్వారా, తక్కువ బడ్జెట్ లో ఉన్న వినియోగదారుల కోసం Redmi 9 మోడల్‌ని ఆగస్టు 4 వ తేదీన Xiaomi సంస్థ విడుదల చేయబోతోంది.

ఆగస్ట్ ఆరో తేదీ నుండి మొదలు కాబోతున్న Amazon Prime Day Saleలో దీని అమ్మకాలు మొదలవుతాయి. ఇప్పటికే ఈ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తోంది. సరిగ్గా అవే స్పెసిఫికేషన్స్ కలిగిన మోడల్ భారతీయ మార్కెట్లో కూడా లభించ బోతోంది. గత ఏడాది విడుదలైన Redmi 8కి కొనసాగింపుగా మనం దీనిని భావించవచ్చు. ప్రధానంగా ఈ ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఫోన్ ముందు భాగంలో ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ notch అమర్చబడి ఉంటుంది. అలాగే స్క్రీన్ చుట్టూ చాలా పలుచటి అంచులు ఉంటాయి. ఫోన్ క్రిందిభాగంలో 3.5mm ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ఛార్జింగ్ పోర్టు ఉంటాయి. 6.53 అంగుళాల Full HD+ రిజల్యూషన్ కలిగి ఉండి, మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్‌ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. 4జిబి ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండే ఈ ఫోన్ ఇండియాలో మరిన్ని స్టోరేజ్ వేరియంట్స్ కలిగి ఉండే అవకాశం ఉంది.

Redmi 9 కెమెరాల విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 8, 5, 2 మెగాపిక్సల్ రిజల్యూషన్ కలిగిన మరో మూడు కెమెరాలు ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5020 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 10W చార్జర్ ఈ ఫోన్లో ఉంటాయి. Usb type c port, గొరిల్లా గ్లాస్ 3 చేత స్క్రీన్ కి రక్షణ కల్పించడం, ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ సదుపాయం, డ్యూయల్ సిమ్ సదుపాయంతో పాటు మెమరీ కార్డు కూడా వాడుకోవచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Computer Era
Logo