ఆరోగ్య సేతు యాప్ పేరుతో వలవేస్తున్న పాకిస్థానీయులు!

Aarogya Setu fake app

గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం Aarogya Setu అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కోరుతున్న విషయం తెలిసిందే.

అన్ని రకాల మీడియా సంస్థల ద్వారా ఈ అప్లికేషన్‌కి సంబంధించిన ప్రకటనలు చూసిన తర్వాత, దేశ ప్రజలందరూ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని అదునుగా చేసుకొని కొంతమంది పాకిస్థానీయులు Aarogya Setu అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని, SMS, Whatsapp ద్వారా పెద్ద మొత్తంలో భారతీయులకు వల వేస్తున్నారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రభుత్వమే తమకు ఈ లింకును పంపించిందని రెండో ఆలోచన లేకుండా దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకండి. Whatasapp, SMS, Facebook ద్వారా వస్తున్న ఈ లింకులను క్లిక్ చేస్తే ChatMe అనే యాప్ మీ ఫోన్ లోకి డౌన్ లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ సహాయంతో పాకిస్తానీ గ్రూపులు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి. ఒకవేళ ఇప్పటికే మీరు పొరబాటున ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, కేవలం దాన్ని తొలగిస్తే సరిపోదు.. మీ ఫోన్ ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేస్తే మాత్రమే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ తొలగిపోతాయి.

Aarogya Setu అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారు, నేరుగా Google Play Store నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అంతే తప్పించి ఇతర లింకుల నుండి డౌన్లోడ్ చేసుకుంటే ప్రమాదం పొంచి ఉంటుంది. కేవలం పాకిస్థానీయులు మాత్రమే కాదు, అనేకమంది ఇతర సైబర్ నేరస్తులు ఆరోగ్య సేతు పేరిట స్కాములు చేయటానికి అన్ని రకాల పన్నాగాలు పన్నుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

కరోనా వైరస్ తర్వాత సైబర్ నేరస్తులు వినియోగదారుల ఫోన్లని హ్యాక్ చేయడానికి వివిధ రకాల ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general