ఇండియాలో మళ్లీ smartphoneల తయారీ మొదలైంది!

smartphone product in India has started

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కొన్ని రంగాలకు సడలింపు ఇచ్చింది.

ఇప్పటికే అనేక విదేశీ కంపెనీలు మనదేశంలో smartphone తయారీ కేంద్రాలను కలిగి ఉన్నాయి. తాజాగా వచ్చిన సడలింపుల నేపథ్యంలో అవి కూడా తిరిగి స్మార్ట్ఫోన్ తయారీని మొదలుపెట్టాయి. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్, చైనాకు చెందిన Xiaomi, Oppo, Vivo వంటి సంస్థలు తిరిగి స్మార్ట్ ఫోన్ ఉత్పత్తికి పూనుకున్నాయి. సాంసంగ్ సంస్థకు నోయిడాలో ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది. పరిమిత సంఖ్యలో అక్కడ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో Xiaomi సంస్థ కలిగివున్న ఉత్పత్తి కేంద్రంలో కూడా కార్యకలాపాలు మొదలయ్యాయి.

మరోవైపు Oppo సంస్థకు కూడా నోయిడాలో ఫ్యాక్టరీ ఉంది. అన్ని కంపెనీలు ప్రస్తుతానికి 30 నుంచి 50 శాతం సామర్థ్యంలో మాత్రమే స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని మొదలుపెట్టాయి. ఇప్పుడిప్పుడే ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ నుండి దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల ఆర్డర్లు మొదలుకావడం, ప్రస్తుతం పాత స్టాక్‌ని ఆర్డర్ చేసిన వినియోగదారులకు డెలివరీ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ల సంఖ్య బాగా పెరగబోతోంది. డిమాండ్ కు తగ్గట్లు సప్లై నిర్వహించాలంటే తప్పని సరిగా ఉత్పత్తి కొనసాగుతూ ఉండాల్సిందే.

Samsung, Xiaomi వంటి సంస్థలు కేవలం ఆన్లైన్ ఆర్డర్ ల మీద ఆధారపడకుండా దేశవ్యాప్తంగా వివిధ నగరాలు పట్టణాల్లో ఉన్న రిటైల్ షాప్ ల ద్వారా వినియోగదారుల ఇళ్లకే చాలా తక్కువ సమయంలో మొబైల్ ఫోన్లను డెలివరీ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే అంశమే.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo