

ఈరోజు Apple iPhone 12 మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ తో పాటు ఎలాంటి ఛార్జర్ అందించడం లేదని ఆ సంస్థ ప్రకటించింది. ఇది టెక్నాలజీ ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఒకవేళ Apple iPhone 12తో పాటు ఛార్జర్ కావాలనుకుంటే దాన్ని ప్రత్యేకంగా ధర పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి ఛార్జర్ ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది.
ఇప్పటికే మీరు iPhone వాడినట్లయితే, అది కొనుగోలు చేసినప్పుడు మీకు వచ్చిన ఛార్జర్‌ని iPhone 12తో పాటు వాడుకోవచ్చు. సరిగ్గా ఇదే విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా Android phoneలను తయారు చేస్తున్న వివిధ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అనుసరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇకమీదట మీరు Android phone కొనుగోలు చేసినప్పుడు కేవలం ఫోన్ మాత్రమే వస్తుంది, దాంతో పాటు ఛార్జర్ అందించబడదు.
Phone తయారీ కంపెనీలు ఎందుకు ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి అన్న డౌట్ చాలామందికి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గించడం, అలాగే ఫోన్ ధర కొద్దిగా తక్కువగా ఉండే విధంగా పరోక్షంగా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. ఉదాహరణకు Apple iPhone 12నే తీసుకుంటే, ఇది 90 శాతం రీసైకిల్ ఫ్రెండ్లీ ఫైబర్ తో తయారు చేయబడి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరుగుతోంది. భారీ మొత్తంలో smartphoneలు అన్ని దేశాల్లో అమ్ముడవుతున్నాయి. గతంలో రెండేళ్లకు ఒక ఫోన్ కొనే వారు కూడా ఇప్పుడు ఏడాదికి ఒక ఫోన్ మార్చే పరిస్థితికి వచ్చింది. ఫోన్ తో పాటు charger, headphoneలను అందించడం వల్ల ఎలక్ట్రానిక్ వేస్ట్ బాగా పెరిగిపోతోంది అని ఫోన్ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేసుకునే విధంగా, ఇప్పటికే తమ దగ్గర ఛార్జర్ ఉన్న వారు ఆ పాత ఛార్జర్ ఉపయోగించుకునే విధంగా phone ర్యాలీ కంపెనీలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. అలాగే పాత చార్జర్ కొత్త ఫోన్ కి కంపాటబుల్ అయ్యే విధంగా ఆయా ఫోన్లను రూపొందిస్తారు.