ఇక మీ ఊళ్లో రైల్వే స్టేషన్‌కి కూడా Free WiFi రానుంది!

railway wifi

ఏ సికింద్రాబాద్ స్టేషన్‌‌కో, ఇంకో ప్రముఖ స్టేషన్‌కో వెళ్లిన వారు అక్కడ ఉచిత WiFi సదుపాయం వినియోగించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి ఫెసిలిటీ తమ ఊళ్లోని స్టేషన్‌కీ ఉంటే బాగుణ్ణు అనుకుంటారు.

ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 8,500 రైల్వే స్టేషన్లలో ఉచిత wifi సేవలు రాబోతున్నాయి. 700 కోట్ల బడ్జెట్‌తో రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేయబోతోంది. ఇటీవల జరిగిన ఓ రైల్వే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. గ్రామీణ ప్రజానీకానికి e-governance సేవలు అందించడానికీ, Digital Indiaని విస్తరించడానికి గ్రామీణ ప్రాంతాల రైల్వే స్టేషన్లలో నెలకొల్పే WiFi సేవలను ఉపయోగించబోతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్లలో WiFi సదుపాయం కలిగిన కియోస్కులు అమర్చబడతాయి. ఇవి digital banking, Aadhaar సేవలు, ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ చేయడం, పన్నులు, బిల్లులు చెల్లించడం వంటి వేర్వేరు సేవలను సాధారణ పౌరులకి అందించబోతున్నాయి. అంతే కాదు.. Amazon, Flipkart వంటి సైట్ల నుండి తమకు కావలసిన వస్తువుల్ని ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఇవి కల్పిస్తాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కియోస్కులు నిర్వహించబడతాయి. మొదట మార్చి 2018 నాటికి 600 స్టేషన్లలోనూ, మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో అంటే 8,500 స్టేషన్లలో WiFi సదుపాయం రానుంది.

Tags:

  1. […] స్టేషన్లలో internet సదుపాయం రాబోతోందని నిన్న ఈ లింకులో చెప్పుకున్నాం కదా. ఈ నేపధ్యంలో తరచూ […]

Computer Era
Logo
Enable registration in settings - general