ఇక మీ DTHలో ఛానళ్లని మరింత సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.. కొత్త యాప్!

DTH channel selection TRAI mobile app

Airtel, TataSky వంటి వివిధ DTH కనెక్షన్లు ఉపయోగించి వినియోగదారులు ఎప్పటికప్పుడు తమకు కావలసిన ఛానళ్లకు సబ్స్క్రిప్షన్ చేయాలన్నా, వద్దనుకున్న వాటిని తొలగించాలి అన్నా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.

ప్రత్యేకంగా ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా గానీ, లేదా సంబంధిత DTH సర్వీసుకు సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా గానీ, ఆ సర్వీసు యొక్క వెబ్సైట్లోకి లాగిన్ కావడం వల్ల గానీ యూజర్లు తమకు కావలసిన ఛానెళ్లని ఎంపిక చేసుకోవచ్చు, వద్దనుకుంటే తొలగించుకోవచ్చు. అయితే ఇంత కష్టపడాల్సిన పని లేకుండా దేశంలోని అన్ని DTH సర్వీసును వాడుతున్న అందరు వినియోగదారులకు ఉపయోగపడే విధంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Android మరియు iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్, వివిధ డిటిహెచ్ సర్వీసులు వాడుతున్న వినియోగదారులు చాలా సులభంగా తమకు కావలసిన ఛానళ్లకి సబ్స్క్రిప్షన్ చెల్లించటానికి, లేదా ఆల్రెడీ ఉన్న వాటిని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. వినియోగదారులు DTH ఛానెళ్ల సబ్‌స్క్రిప్షన్లని సమర్థవంతంగా నిర్వహించుకోవడం ద్వారా ప్రతి నెలా వారికి అయ్యే ఖర్చు మరింత తగ్గించుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ కి సంబంధించిన టోర్నమెంట్ జరిగేటప్పుడు కొన్ని ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేసి చాలామంది మర్చిపోతూ ఉంటారు.

అలాంటప్పుడు TRAI విడుదల చేసిన ఈ అప్లికేషన్ ఎల్లప్పుడూ ఫోన్ లో అందుబాటులో ఉంటే, ఇప్పటికి ఇప్పుడు మన ప్యాకేజ్ లో ఉన్న ఛానళ్ల వివరాలు చూడటంతోపాటు అనవసరమైన వాటిని తొలగించుకొని ప్రయోజనం పొందవచ్చు. కేవలం డిటిహెచ్ మాత్రమే కాకుండా కె దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లను కూడా ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్కు సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఇది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general