ఇక మీ phoneతో ఎక్కడైనా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు – కొత్త సదుపాయం తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్

upi app amount withdrawal

ఇప్పటివరకు డబ్బులు విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా ATMలకి పరుగులు పెట్టే వారు. దాదాపు అన్ని రకాల పేమెంట్స్ మన మొబైల్ లోనే Google Pay, PhonePe వంటి అప్లికేషన్స్ ద్వారా చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ నగదు కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఏటీఎం వాడాల్సి వచ్చేది.

అయితే కోవిడ్ – 19 కారణంగా దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ బ్యాంకులతో అనుసంధానం చేయబడి ఉన్న షాపులు తమ దగ్గరకు వచ్చే ఖాతాదారులు కోరితే స్వల్ప మొత్తంలో UPI అప్లికేషన్ల ద్వారా వారి నుండి చెల్లింపులు స్వీకరించి, దానికి బదులుగా వారికి నగదు ఇచ్చే సదుపాయాన్ని RBI కల్పిస్తోంది.

అంటే, ఇంతకుముందు మొబైల్ రీఛార్జి చేసుకోవడానికి ఎలా బయటకు షాపులకి వెళ్లే వాళ్లమో అదేవిధంగా ఇకమీదట అర్జెంటుగా నగదు కావలసి వస్తే ATM కోసం చూడాల్సిన పని లేకుండా, మీకు దగ్గరలో ఉండే ఏదైనా కిరానా షాప్ గానీ, మెడికల్ షాప్ ల వంటి వాటి ద్వారా వారికి తగిన మొత్తాన్ని మీ దగ్గర ఉండే Google Pay, PhonePe వంటి అప్లికేషన్ల ద్వారా చెల్లించి, దానికి బదులుగా నగదు పొందొచ్చు. అయితే కేవలం పరిమిత మొత్తంలో మాత్రమే నగదు విత్డ్రా చేసుకోవచ్చు. పెద్ద నగరం లో రోజుకి వెయ్యి రూపాయలు, చిన్న నగరాల్లో రోజుకి రెండు వేల రూపాయలు ఇలా పొందొచ్చు.

కేవలం యూపీఐ అప్లికేషన్ల ద్వారా మాత్రమే కాకుండా, స్వైపింగ్ మిషన్ లను కలిగి ఉన్న వ్యాపారస్తులు డెబిట్ కార్డుల ద్వారా ఖాతాదారుల నుండి అమౌంట్ తీసుకొని, దానికి బదులుగా వారికి నగదు ఇచ్చే వెసులుబాటు కూడా లభిస్తుంది. ఇలాంటి స్వైపింగ్ మిషన్ దగ్గర క్రెడిట్ కార్డులు మాత్రం అనుమతించబడవు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general