Selfie పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం అలుపెరగకుండా ఒకటికి పది ఫొటోలు phone front cameraతో కేప్చర్ చేస్తున్నారా? సెల్ఫీలు విపరీతంగా తీయడం smartphone స్క్రీన్ కాంతి మొహం మీద పడి చర్మంపై ముడతలుపడతాయని ఇటీవల వెల్లడైంది గుర్తుంది కదా. తాజాగా Selfieలతో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.
ఇలా Selfies తీస్తే ఇక అంతే..!!
అదే పనిగా Selfieలను కేప్చర్ చేసే వారికి Selfie Elbow అనే సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు నిర్థారణకు వచ్చారు. టెన్నిస్ ఎల్‌బో, గోల్ఫర్ ఎల్‌బో వంటి వాటి గురించి మనకు ఇప్పటికే తెలిసిందే. అయితే selfie కేప్చర్ చెయ్యడం కోసం మనం చేతిని పైకి తిప్పి ఓ అసౌకర్యకరమైన స్థితిలో అదే పనిగా పెట్టడం వల్ల ఈ Selfie Elbow సమస్య పెరిగిపోతుంది.
సెల్ఫీ కోసం ప్రయత్నించేటప్పుడు.. అదీ ఒకటికి పది ఫొటోలు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనకు తెలీకుండానే మజిల్ మీద వత్తిడి పడుతుంది. ఆ కండరం ఎముక నుండి విడిపడిపోయి నొప్పి, వాపులకు కారణం అవుతుంటుంది.
Selfie Elbow నుండి ఉపశమనం కోసం తాత్కాలికంగా నొప్పి నివారణ మందులు వాడడం, ఐస్‌తో కాపడం పెట్టడం, కండరాలను సాగదీస్తూ చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చెయ్యడం మంచి ఫలితాలను ఇస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా selfie elbow సమస్య చాపక్రింద నీరులా విస్తరిస్తోందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదే పనిగా చేతుల్ని అసహజ భంగిమల్లో అమర్చుకుని సెల్ఫీలను తీయడం వల్ల selfie elbowతో పాటు మణికట్టు ప్రాంతంలో photosని కేప్చర్ చెయ్యడానికి మనం వాడే బొటనవేలు అమర్చే కోణంపై కూడా వత్తిడి పడి ఇబ్బంది తలెత్తుతున్నట్లు తేలింది. చాలా సందర్భాల్లో selfie stick లను వాడడం వల్ల ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు.
Technology చాలా విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న విషయలు ఇటీవల వెలుగు చూస్తున్న వైద్య పరిశోధనల ద్వారా అర్థమవుతూ ఉంది. అయితే ఏది ఎంతమేరకు వాడాలో సరైన అవగాహన కలిగి ఉండి ఏదీ శృతి మించకుండా చూసుకోగలిగితే అటు latest technologyని వాడుకోగలుగుతూనే, ఇటు ఆరోగ్యాన్నీ కాపాడుకోగలుగుతాం.