ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!

1 crore iphone theft from Amazon

Amazonలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు.. iPhoneలపై ఆశపడ్డారు. గిడ్డంగి నుండి ఏకంగా రెండు నెలలపాటు రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క phone చొప్పున దొంగిలించడం మొదలుపెట్టారు.

దాంతో వేగంగా రెండు నెలల్లో 78 ఫోన్లు మిస్ అయ్యాయి. వీటి ధర కోటి రూపాయల వరకు ఉంది. గుర్గావ్‌లో Amazonకి వేర్‌హౌస్ ఉంది. ఇక్కడి నుండి అనేక ఫోన్లు దేశవ్యాప్తంగా షిప్పింగ్ అవుతుంటాయి. కరోనా పాండమిక్ కారణంగా, ఈ గిడ్డంగిలో చాలాకాలంపాటు సెక్యూరిటీ తనిఖీలను సడలించారు. సరిగ్గా దీన్ని అదునుగా చేసుకొని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రోజుకొక iPhone చొప్పున దొంగిలించటం మొదలుపెట్టారు.

చివరికి విషయాన్ని తెలుసుకున్న Amazon పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వివిధ కోణాల్లో కేసు విచారించి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు దొంగలించిన 78 iPhoneల నుండి 50 లక్షల రూపాయల విలువ కలిగిన 38 ఫోన్లని పోలీసులు విజయవంతంగా రికవర్ చెయ్యగలిగారు. మిగిలిన 40 ఫోన్ల వ్యవహారం తేలాల్సి ఉంది. అన్సార్ ఉల్ హక్, నవాబ్ సింగ్ అనే ఈ ఇద్దరు ఉద్యోగులను గుర్గావ్‌లోని వారి ఇళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాస్తవంగా లాక్ డౌన్ తర్వాత గుర్గావ్‌లోని Amazon వేర్‌హౌస్ కార్యకలాపాలు పునరుద్ధరించినప్పుడు సామాజిక దూరం నియమాలను అనుసరిస్తూ, ఉద్యోగులు విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా చేసే తనిఖీలను పూర్తిగా తొలగించారు. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ఇద్దరు ఉద్యోగులు రిటైల్ బాక్స్‌ల నుండి iPhoneలను తొలగించి, వాటిని జేబులో పెట్టుకుని బయటకు తీసుకు వెళ్ళటం మొదలుపెట్టారు. రెండు నెలల తర్వాత ఇలా చేసిన తర్వాత స్క్రూటినీని తప్పించుకోవడం కోసం వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఆగస్టు 28 వ తేదీన Amazon ఈ సంస్థ ఈ విషయాన్ని గుర్తించి, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం, విచారణ కొనసాగడం, మూడు రోజుల క్రితం వారిని అరెస్టు చేయడం జరిగింది.

Computer Era
Logo
Enable registration in settings - general