
ఇటీవలి కాలంలో మార్కెట్లో వస్తున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ సమయంలో వేగంగా చార్జింగ్ పూర్తయ్యే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా Oppo సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టిన Oppo Ace Reno ఫోన్ ఇప్పటివరకు ఉన్న ఇతర ఫోన్స్ తో పోలిస్తే కేవలం 30 నిమిషాల్లో 100% ఛార్జింగ్ అవుతుంది. కచ్చితంగా ఇది స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవాలి. ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.5 అంగుళాల 1080p డిస్ప్లే కలిగి ఉండిక్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 processor ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. అలాగే విజువల్ ఎక్స్పీరియన్స్ స్మూత్ గా ఉండడం కోసం 90 Hz రిఫ్రెష్ రేట్ ఇది కలిగి ఉంటుంది.