
అక్టోబర్ 2019లో అనేక కొత్త ఫోన్స్ భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్నాయి. వాటికి సంబంధించిన ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం ఇప్పుడు చూద్దాం.
OnePlus 7T Pro
అక్టోబర్ 10న లండన్ లో జరిగే ఒక ఈవెంట్ లో oneplus 7T Pro మార్కెట్లో విడుదల కాబోతోంది. అయితే తాజాగా అమెజాన్ ఇండియా వెబ్సైట్లో కనిపించిన టీజర్ ప్రకారం అదే రోజు ఇండియాలో కూడా ఫోన్ విడుదల అవుతుందని తెలుస్తోంది. అక్కడ పేర్కొనబడిన వివరాల ప్రకారం అక్టోబర్ 15వ తేదీ నుండి ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి లభిస్తుంది. HDFC బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు వాడేవారు 3000 రూపాయల వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చు.