ఈ ఫీచర్ అన్ని Xiaomi phoneలకి రాదు!

xiaomi split screen

Xiaomi సంస్థ MIUI 9 updateని త్వరలో పలు మోడళ్లకి చెందిన Xiaomi phoneలకు తీసుకు వస్తున్న విషయం విదితమే.

ఈ MIUI 9 వెర్షన్‌లో అందర్నీ ఆకట్టుకునే ప్రధానమైన ఫీచర్ Split Screen. ఒకటే స్క్రీన్‌లో రెండు వేర్వేరు appsని రన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.  ఇప్పటికే చాలాకాలంగా పలు Samsung phoneలకి లభిస్తున్న ఈ ఫీచర్ మొదటిసారిగా Xiaomi phoneలకి వస్తోంది.

అయితే MIUI 9లోని ఈ Split Screen ఫీచర్ అన్ని Xiaomi phoneలకీ లభించబోవట్లేదు. కేవలం 16 మోడళ్లకి చెందిన Xiaomi phoneలకు మాత్రమే ఈ సదుపాయం రాబోతోంది. Xiaomi Mi Mix, Xiaomi Mi Note 2, Xiaomi Mi 6, Xiaomi Mi Max, Xiaomi Mi Max 2, Xiaomi Mi 5, Xiaomi Mi 5 Plus, Xiaomi M 5S, Xiaomi Mi 5S Plus వంటి ఫోన్లతో పాటు..

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Xiaomi Mi 5c, Xiaomi Mi 5x, Xiaomi 4S, Xiaomi Mi 4c, Xiaomi Mi Note, Xiaomi Redmi Note 4, 4A, Xiaomi Redmi Note 3 ఫోన్లకి మాత్రమే ఈ split screen ఫీచర్ రాబోతోంది. ఈ జాబితాలో లేని వేరే ఏ ఇతర phoneనైనా మీరు వాడుతున్నట్లయితే MIUI 9 అయితే మీ phoneకి వస్తుంది గానీ split screen మాత్రం రాదు.

 

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/DiKzjROIUPX3u9KKPyaCbg అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo