ఈ లేటెస్ట్ టెక్నాలజీ Video చూస్తే కచ్చితంగా “వావ్” అంటారు!

ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక అద్భుతమైన ప్రాజెక్టులు వెలుగులోకి వస్తున్నాయి. సహజంగా ఒక ఫోటోలో ఏవైనా అవాంఛిత దృశ్యాలు ఉంటే వాటిని Photoshop వంటి వాటిల్లో సులభంగా తొలగించుకోవడానికి ఆప్షన్స్ లభిస్తుంటాయి.

ఒకవేళ ఏదైనా వీడియోలో మీకు అవసరం లేని వ్యక్తులను గానీ, వస్తువులను గానీ సులభంగా డిలీట్ చేయాలంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. Flow-edge Guided Video Completion పేరుతో పిలువబడే ఈ ఆల్గారిథమ్ ఏదైనా వీడియోలోని సెలెక్ట్ చేసిన భాగాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో అప్పటికే చుట్టుపక్కల ఉన్న పిక్సెళ్లతో పూర్తి చేస్తుంది.

ఫైనల్ గా లభించే వీడియో మాడిఫై చేయబడింది అనే సందేహం ఏమాత్రం రాకుండా ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే అనేక రకాల ఫ్లో కంప్లీషన్ పద్ధతులు వినియోగంలో ఉన్నప్పటికీ వాటి అన్నిటికంటే చాలా సహజసిద్ధంగా ఔట్పుట్ లభించే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ క్రింద వీడియోని మీరు చూస్తే గనుక కచ్చితంగా ఆ విషయం ఒప్పుకుంటారు. ఒక ప్లే గ్రౌండ్ లో ఆట ఆడుతున్న ఆట గాడిని, అతని నీడతో సహా తొలగించడంతో పాటు రకాల సందర్భాలలో రకరకాల అవాంఛిత దృశ్యాలను ఎంపిక చేసుకుని వాటిని డిలీట్ చేసి ఫైనల్ అవుట్ పుట్ సాధించడానికి సాధ్యపడుతుంది.

ఈ ఆల్గారిధమ్ ఆధారంగా మున్ముందు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కోడ్ కూడా Githubలో లభిస్తోంది. లైనక్స్ ఎన్విరాన్‌మెంట్‌లో పైథాన్ ద్వారా దీనిని ప్రాక్టికల్గా ప్రయత్నించవచ్చు. అయితే ఒక మామూలు యూజర్ దీనిని నేరుగా వాడాలంటే మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మున్ముందు ఈ టెక్నాలజీని మరింత సరళీకృతం చేసి అందరూ వాడుకోగలిగే విధంగా అప్లికేషన్స్ రావచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general