ఈ 5 టిప్స్ ఫాలో అయితే మీ phone సూపర్ ఫాస్ట్ పనిచేస్తుంది!

5 tips to speedup your android smartphone

Android phone వాడుతున్నారా? ఇప్పుడు పని చేస్తున్న దాని కంటే మీ ఫోన్ మరింత వేగంగా పని చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. కచ్చితంగా మీ ఫోన్ మునుపటి కంటే వేగంగా ఉన్నట్లు మీరే గుర్తించగలుగుతారు.

ఈ యాప్ వాడండి

Google సంస్థ స్వయంగా తయారు చేసిన Files by Google అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ లో వివిధ అప్లికేషన్స్ క్రియేట్ చేసిన cacheని క్లియర్ చెయ్యడంతోపాటు, అనవసరంగా పేరుకుపోయిన ఫైళ్లు మరియు ఫోల్డర్లను తొలగించి తగినంత ఖాళీ స్థలం ఎప్పటికప్పుడు ఉండే విధంగా చేయండి. కచ్చితంగా ఫోన్ పని తీరులో చాలా మార్పు వస్తుంది.

చాలాకాలంగా వాడనివి!

ప్రతీ ఒక్కరూ తమ phoneలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని, చాలా రోజుల తరబడి వాటి జోలికి వెళ్లరు. ఇలా మీ ఫోన్లో అనవసరంగా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నట్లయితే కనీసం నెల రోజులకు ఒకసారి గుర్తించి వాటిని వెంటనే ఫోన్ నుండి తొలగించండి. దీనివలన మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అనేక ప్రాసెస్‌లు నిలిచిపోయి పరోక్షంగా ఫోన్ వేగవంతమవుతుంది.

లైట్ వెయిట్ వెర్షన్లు

Facebook, Twitter, Gmail వంటి దాదాపు ప్రతి అప్లికేషన్‌కి ఓ లైట్ వెయిట్ వెర్షన్ Google Play Storeలో లభిస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కచ్చితంగా మెమరీ వినియోగం బాగా తగ్గి, ఫోన్ మునుపటి కంటే వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఇలా లైట్ వెయిట్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు పెద్దగా కోల్పోయేది కూడా ఏమీ ఉండదు. దాదాపు అన్ని ఆప్షన్స్ పూర్తిస్థాయి వెర్షన్‌లో ఎలా ఉంటాయో అదేవిధంగా లైట్ వెయిట్ వెర్షన్‌లోనూ లభిస్తుంటాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

లేటెస్ట్ అప్డేట్స్

మీ ఫోన్ కి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అశ్రద్ధ చేయకుండా ఇంస్టాల్ చేసుకోండి. దీనివల్ల ఆపరేటింగ్ సిస్టం లో, మరియు వివిధ అప్లికేషన్స్‌లో ఉన్న లోపాలు సరి చేయబడి ఫోన్ పని తీరులో మరింత మెరుగుదల కనిపిస్తుంది.

హోమ్ స్క్రీన్‌లో!

చాలామంది తమ phoneలో Home screenలో కల్పి కనిపించిన అన్ని షార్ట్ కట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్తగా ఫోన్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు కూడా మన అనుమతి లేకుండానే వాటి షార్ట్కట్స్ ఫోన్ హోమ్ స్క్రీన్ లో అమర్చుతూ ఉంటాయి. హోమ్ స్క్రీన్ ఇలా పూర్తిగా నిండిపోయి గందరగోళంగా ఉండటం వల్ల దాని ప్రభావం ఫోన్ రెస్పాన్స్ మీద కూడా పడుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన షార్ట్కట్స్ మాత్రమే హోమ్ స్క్రీన్ లో ఉండే విధంగా అమర్చుకోండి.

Computer Era
Logo
Enable registration in settings - general