ఈ model phone ధరలు తాజాగా తగ్గాయి!

smartphones with discounted price in india

Smartphone ధరలు ఎప్పటికప్పుడు పెరగడమే తప్పించి తగ్గే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వివిధ కారణాల వల్ల తాజాగా కొన్ని స్మార్ట్ ఫోన్ ధరలు మనదేశంలో తగ్గాయి. ఆయా మోడల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Samsung Galaxy Z Flip

సామ్సంగ్ సంస్థ అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఫోల్డబుల్ ఫోన్ భారతీయ మార్కెట్లో 1,15,999 రూపాయలకు విడుదలైంది. అయితే అది ఇప్పుడు 1,08,999 రూపాయలకు లభిస్తోంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 processor ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A31

21,999 రూపాయలకు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం కేవలం 20,999 రూపాయలకు లభిస్తుంది. 6 జి బి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉంటాయి. రోజువారీ అవసరాలకు మాత్రమే కాకుండా, గేమింగ్ కోసం కూడా ఇది ఒక వ్యక్తి గా ఉంటుంది ఉపయుక్తంగా ఉంటుంది.

Oppo Reno 3 Pro

31,990 రూపాయలకు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 29,990 రూపాయలకు లభిస్తోంది. మీడియా టెక్ హీలియో P95 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, 8gb ర్యామ్, 128 gb ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో లభిస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో amoled display ఈ ఫోన్లో ఉంటుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 10 Lite

41,999 రూపాయలు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం 37,999 రూపాయలకు లభిస్తోంది. సామ్సంగ్ సంస్థ స్వయంగా తయారు చేసిన Exynos ప్రాస ఆధారంగా పని చేస్తూ, 6 జి బి రామ్‌ని ఇది కలిగి ఉంటుంది.

Oppo F15

19,990 రూపాయలకు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం కేవలం 18,990 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉండి, చూడడానికి ఆకర్షణీయంగా ఉండే ఫోన్ ఇది.

Oppo Reno 2F

25,990 రూపాయలకు విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 23,990 రూపాయలకు లభిస్తోంది. 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, ఫోన్ వెనుక భాగంలో గ్రేడియంట్ డిజైన్ దీనికి ఉంటుంది.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/DiKzjROIUPX3u9KKPyaCbg అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo