
మీరు ACT Fibernet కస్టమర్లా? అయితే మీకో శుభవార్త. ACT Fibernet సంస్థ తన ఖాతాదారులు అందరికీ ఏకంగా 250 GB అదనపు బ్రాడ్బ్యాండ్ డేటాను ఉచితంగా అందిస్తోంది.
IPL 2018 సీజన్‌ని దృష్టిలో ఉంచుకొని T20 Data Surprise పేరిట ఈ బహుమానం అందిస్తోంది. వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా IPL 2018లో అన్ని క్రికెట్ మ్యాచ్‌లను ఆన్లైన్లో చూడ్డానికి వీలుగా ఈ డేటా అందించబడుతోంది. కచ్చితంగా ఇది క్రికెట్ అభిమానుల్ని సంతోషపరుస్తుందనడంలో సందేహమే లేదు. ఒకవేళ మీరు క్రికెట్ చూడకపోయినా.. ఈ అదనపు డేటాని వేరే అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఈ 250 GB డేటా మే 31, 2018 వరకూ వేలిడిటీ కలిగి ఉంటుంది. ఈ లోపు మీరు ఎప్పుడైనా దాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుండి మొదలయ్యే IPL 2018ని Hotstarలో ప్రీమియం subscription ద్వారాగానీ, లేదా 299 రూపాయల విలువైన Sports pack ద్వారా గానీ వీక్షించవచ్చు. అలాగే Airtel వినియోగదారులు Airtel TV అప్లికేషన్లోనూ, Reliance Jio వినియోగదారులు JioTV అప్లికేషన్‌లోనూ ఈ మ్యాచ్‌లను చూడడానికి అవకాశముంది.