ఒక కెమెరాతోనే Portrait mode వస్తున్న Xiaomi Phoneలలో మీది ఉందా?

xiaomi phone portrait mode

Portrait Mode.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం. ఒక మనిషిని, లేదా వస్తువును హైలెట్ చేసి, వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటానికి ఈ portrait mode వెసులుబాటు కల్పిస్తుంది.

అయితే దీన్ని సాధించటానికి దాదాపు ఈ మధ్యకాలంలో అధికశాతం ఫోన్లలో dual camera setup పొందుపరచబడి ఉంటోంది. అంటే ఫోన్ వెనకభాగంలో రెండు కెమెరాలు ఉంటే వాటిలో ప్రైమరీ కెమెరా అసలు ఫొటోని కేప్చర్ చేస్తుంది, రెండో కెమెరా డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ని కేప్చర్ చేసి, మనకు బ్యాగ్రౌండ్ బ్లర్ అయ్యే ఎఫెక్టు సాధించిపెడుతుంది.

అంతవరకు బాగానే ఉంది, అయితే ఇప్పటికే ఒక కెమెరాతో మీరు కొనుగోలు చేసిన ఫోన్లో అలాంటి portrait mode సాధించాలనుకుంటే కష్టమనుకోకండి. వివిధ టెక్నిక్ల ద్వారా పలురకాల ఫోన్ మోడళ్లకి ఈ పోర్ట్రెయిట్ మోడ్ సదుపాయం ఈ మధ్యకాలంలో వస్తోంది. అదే క్రమంలో తాజాగా MIUI 10 వెర్షన్ ద్వారా Xiaomi సంస్థ కూడా తాను తయారు చేసిన వివిధ ఫోన్లకు ఈ portrait mode సదుపాయం తీసుకువచ్చింది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

లక్షకుపైగా ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అధ్యయనం చేయడం ద్వారా సింగిల్ కెమెరా ఉన్న ఫోన్లకు కూడా ఈ portrait modeని Xiaomi ప్రవేశపెట్టింది. అయితే మొదటి దశలో కొద్ది మొత్తంలో డివైజ్లకు మాత్రమే ఈ సదుపాయం రాబోతోంది. Mi Mix 2, Mi 5s, Mi 5s Plus, Mi 5, Mi Note 2, Mi Max, Mi Max 2, Redmi Note 4, Redmi Note 4X, Redmi Note 3, Redmi 5, Redmi 4, Redmi 4X వంటి ఫోన్లలో బ్యాక్ కెమెరాలో ఈ portrait mode లభిస్తోంది. అలాగే Mi 6, Redmi Note 5 ఫోన్లలో బ్యాక్ కెమెరాతో పాటు, ఫ్రంట్ కెమెరాకి కూడా portrait mode లభించబోతోంది.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఇక మిగిలిన డివైజ్లకు రాబోయే కొద్ది నెలల్లో ఈ సదుపాయం అందించబడుతుంది.

      Computer Era
      Logo