

“కుమార్” ఒక smartphone కొనాలనుకున్నాడు. Amazon, Flipkartలోకి వెళ్లాడు. ఆ ప్రోడక్ట్ క్రింద రివ్యూలు చదవటం మొదలు పెట్టాడు. Top reviews అని ఎప్పుడో 2018, 2019లో రాయబడిన నాలుగైదు fake reviewsలు కనిపించాయి.
“ప్రోడక్ట్ అస్సలు బాలేదు, వేస్ట్” అంటూ రాయబడి ఉన్న ఆ కామెంట్లని చదివి నిరుత్సాహపడి కొనడం ఆపేశాడు. వాస్తవానికి అవి ప్రత్యర్థి బ్రాండ్ల చేత వ్యూహాత్మకంగా రాయబడిన పెయిడ్ ఫేక్ రివ్యూలు అన్న విషయం అతనికి ఏ మాత్రం అర్థం కాదు. అదే “కుమార్” మరో స్మార్ట్‌వాచ్ తీసుకుందామని Youtubeలో రివ్యూలు చూడడం మొదలుపెట్టాడు. “ఈ మోడల్‌కి తిరుగే లేదు” అంటూ చాలా వీడియోలు కనిపించాయి. రెండో ఆలోచన లేకుండా కొన్నాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత వాడటం మొదలు పెడితే అది ఒక చెత్త ప్రొడక్ట్.
ఇక్కడ Youtube రివ్యూల గురించి కాస్త వివరంగా చెప్పాలి. ఒక smartphone గురించి గానీ, ఇతర gadgets గురించి మీకు Youtubeలో కనిపించే అధికశాతం రివ్యూలు డబ్బులకు అమ్ముడుపోయి చేయబడే పాజిటివ్ రివ్యూలు మాత్రమే. ఒక phoneని ఆ కంపెనీ డెమోగా సదరు యూట్యూబర్‌కి పంపిస్తుంది. రివ్యూ చేసినందుకు 5 నుండి 10 వేల వరకూ చెల్లిస్తారు. “కంప్యూటర్ ఎరా”ని కూడా ఇలాగే అనేక కంపెనీలు అప్రోచ్ అవుతూ ఉంటాయి. అయితే నాసికరం ప్రోడక్టులను జనాలకు అంటగట్టి డబ్బులు చేసుకోవడం “కంప్యూటర్ ఎరా”కి ఈ 20 సంవత్సరాలలో ఎప్పుడూ అలవాటు లేదు. అందుకే అంతా ఆహా ఓహో అని చెప్పే paid reviewలు, ప్రోడక్ట్ అన్‌బాక్సింక్‌లకి “కంప్యూటర్ ఎరా” ఎప్పుడూ దూరంగా ఉంటుంది. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. “యూట్యూబ్ రివ్యూలను నమ్మి ఫోన్లు, గ్యాడ్జెట్లు కొనేవాళ్లని చూసి జాలిపడాలి”.
ఇదంతా కూడా ఒక విషవలయం. ఇందులో ఏ ప్రభావాలకు లోనుకాని “కంప్యూటర్ ఎరా” లాంటి సంస్థలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. అందుకే ప్రోడక్ట్ రేటింగ్ లు, రివ్యూలు చదివి దేన్నిబడితే దాన్ని కొనకండి. చెప్పే వ్యక్తి జెన్యూన్ అయి ఉంటే దేన్నయినా కొనొచ్చు. అలాగే చెత్తగా ఉందని రాయబడిన రివ్యూలను చూసీ ఆగిపోకండి.. కొన్నిసార్లు మంచి deals మిస్ అవుతారు. వాస్తవానికి Amazonలో Jabra Earbudsని కొంతమంది మిత్రులు కొనేముందు పైన నాలుగైదు రివ్యూలు badగా ఉన్నాయని నా దృష్టికి తీసుకొచ్చారు. నాకు ఒకటే నమ్మకం.. సంవత్సరం నుండి దీన్ని వాడుతున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. అదీగాక 13,990 రూపాయల విలువ కలిగిన ప్రోడక్ట్ 3,999కి లభించడం ఏమాత్రం మామూలు డీల్ కాదు. అందుకే ధైర్యంగా మిత్రులకు గైడ్ చేశాను. Amazon ఫేక్ రివ్యూలను చూసి డిసప్పాయింట్ అయిన వారు, తీరా తమకు product వచ్చాక మళ్లీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. Samsung, OnePlus లాంటి earbuds ఏమాత్రం దీని క్వాలిటీ ముందు నిలవవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇయర్‌బడ్స్ తీసుకోవాలనుకున్న వారు ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి నమ్మదగిన వ్యక్తులను, రివ్యూలనే నమ్మండి.