
Xiaomi సంస్థకు అందుబాటులోకి తీసుకొచ్చిన Redmi 9 Power రేపటి నుండి Amazonలో https://amzn.to/34wcfg2లో లభించబోతోంది. 10,999 రూపాయలకు దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ Redmi 9 Power phone పనితీరు ఎలా ఉంది ఇప్పుడు వివరంగా చూద్దాం.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ
Redmi అనేది Xiaomi సంస్థకు చెందిన budget phoneల విభాగంగా పరిగణించవచ్చు. అందుకే Redmi 9 Powerని కూడా రూ. 10,999కే అందిస్తున్నారు. 6.53 అంగుళాల Full HD IPS డిస్ప్లే కలిగి ఉండే ఈ ఫోన్లో 400 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అంటే నేరుగా సూర్యకాంతి కింద కూడా ఫోన్ స్క్రీన్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్ రక్షణకోసం గొరిల్లా గ్లాస్ 3 ఉపయోగించబడింది. ఈ ఫోన్ మందం 9.6mm ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో పాలికార్బోనేట్ బాడీ ఉపయోగించబడింది. ఇది ఆకర్షణీయంగా కనిపించడం కోసం టెక్చర్ డిజైన్ కలిగి ఉంటుంది. వేలిముద్రలను పేరుకోకుండా ఇది కాపాడుతుంది. అధికశాతం Redmi 9 సిరీస్ ఫోన్లకు మాదిరిగానే కొత్తగా వచ్చిన ఈ Redmi 9 Power కూడా కనిపిస్తుంది.