సాఫ్ట్వేర్ ఇలా!
Redmi 9 Powerలో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే MIUI 12 అందించబడింది. ఈ యూజర్ ఇంటర్ ఫేస్ లో అనేక కొత్త సదుపాయాలు, కొత్త ఐకాన్లు, వాల్ పేపర్లు, గతంతో పోలిస్తే భిన్నమైన సెట్టింగ్స్ పేజ్ లభిస్తుంటాయి. ఫోన్ తో పాటే Netflix, Facebook, WPS Office, LinkedIn వంటి వివిధ అప్లికేషన్స్ కూడా కనిపిస్తాయి. ఫోన్ రూపురేఖలను మార్చుకోవడం కోసం భారీ మొత్తంలో కొత్త థీమ్స్ కూడా లభిస్తున్నాయి. గేమ్స్ ఆడే టప్పుడు ఉపయోగపడే గేమ్ టర్బో, బ్యాటరీని బాగా అర చేసి అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ లాంటివీ ఉన్నాయి.
హార్డ్వేర్ మరియు పనితీరు
మధ్యస్థాయి ధర కలిగిన ఫోన్లలో సహజంగా ఉపయోగించబడే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ Redmi 9 Power లాంటి బడ్జెట్ ఫోన్లో ఉపయోగించడం కచ్చితంగా అందర్నీ ఆకర్షిస్తుంది. 4 జి బి రామ్ తో పాటు, 64gb లేదా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గలిగిన 2 మోడల్స్ దీంట్లో లభిస్తాయి. ఈ ధరలో లభిస్తున్న ఇతర phoneలతో పోలిస్తే బెంచ్మార్క్ స్కోర్లలో ఈ ఫోన్ మెరుగైన ఫలితాలు అందిస్తోంది. గేమింగ్ అవసరాల కోసం Adreno 610 గ్రాఫిక్స్ ప్రాసెసర్ Redmi 9 Powerలో లభిస్తుంది. మామూలు గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి lag కనిపించదు. అయితే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మీరు ఫోన్ కొంటుంటే వేరే ఫోన్ కి వెళ్ళటం మంచిది.