కొత్త ఫోన్ల కంటే refurbished phonesకి బాగా ఆదరణ పెరిగిందట!

Refurbished smartphone sales are in rise

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అందరి ఆర్థిక స్థితిగతులు ఇబ్బందుల్లో పడ్డాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆన్లైన్ షాపింగ్ విషయంలో కూడా ఇదే సరళి కొనసాగుతోంది. Smartphone కొనుగోళ్ల విషయంలో తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొత్త ఫోన్ లను కొనుగోలు చేయడానికి బదులు అధిక శాతం మంది refurbished phoneలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. Refurbished phone అంటే, మీరు ఒక కొత్త ఫోన్ కొనుగోలు చేశారు అనుకోండి. అందులో ఏదో చిన్న గీతపడి గానీ, మరో చిన్న లోపం ఉండి గానీ దాన్ని మీరు వెనక్కి తిరిగి పంపినట్లయితే, ఆ ఫోన్ తయారు చేసిన కంపెనీ ఆ చిన్న లోపాన్ని సరిచేసి మళ్లీ అమ్మకానికి పెడుతుంది. అలా చేసినప్పుడు అసలు ధర కంటే కొద్దిగా తక్కువ ధరకు అది విక్రయించబడుతుంది. అలాంటి refurbished models చాలా కాలం నుండి భారతీయ మార్కెట్లో ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు అధిక శాతం మంది కొత్త ఫోన్ కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

దీనికి రెండు అంశాలు కారణాలుగా తెలుస్తున్నాయి. మొట్టమొదటిది భారతీయ smartphone మార్కెట్లో 70 శాతానికి పైగా వాటిని చైనా ఫోన్ తయారీ కంపెనీలే ఆక్రమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా నుండి ఫోన్లు, ఫోన్ల అసెంబ్లింగ్‌కి వాడే ముడి పదార్థాల దిగుమతి విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులు కారణంగా కొత్త ఫోన్లు తగినంత స్టాక్ ప్రస్తుతం మార్కెట్లో లేవు. డిమాండ్కు తగ్గ సప్లై పునరుద్ధరించబడితే పరిస్థితి కొంత వరకు చక్కబడవచ్చు. మరోవైపు చైనా ఫోన్ల పట్ల ఉన్న సెంటిమెంట్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఇదిలా ఉంటే, ఆర్థిక పరంగా చాలా మంది ఇబ్బందులు ఉండటం వలన ఎక్కువ ధర పెట్టి కొత్త ఫోన్ కొనడం కన్నా, ఎంతో కొంత తక్కువ ధరకు Refurbished phone కొనుగోలు చేయడం ఉత్తమమని భావిస్తున్నట్లు కూడా సమాచారం. మరీ ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా వీటి అమ్మకాలు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. పాత ఫోన్లను, Refurbished phoneలను విక్రయించే Yaantra, Cashify, Olx, Xtracover వంటి అన్ని రకాల సర్వీసులు తమకు భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయని తెలియజేస్తున్నాయి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general