కొత్త Laptop కొనేటప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!

laptop selection guide

పండగ సీజన్ వచ్చేసింది.. Amazon, Flipkartలలో అనేక ఉత్పత్తులు మీద భారీగా డిస్కౌంట్స్ లభించబోతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా ఆఫర్లను మీ దృష్టికి తీసుకు రావటానికి ” కంప్యూటర్ ఎరా” ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఈ పండుగ సీజన్లో మీరు ఏదైనా కొత్తగా laptop కొనాలనుకుంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.

దేని కోసం కొంటున్నారు?

మీరు ఏ అవసరం కోసం laptop కొంటున్నారు, దాని మీద ఎలాంటి పనులు చేస్తారు అన్న దాని మీద మీకు కచ్చితంగా స్పష్టత ఉండాలి. గేమింగ్ మరియు గ్రాఫిక్స్ అవసరాల కోసం Intel i7 వంటి శక్తివంతమైన ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్ పెంచుకోవాలి. అదే వెబ్ బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు వంటి చిన్నచిన్న అవసరాలకోసం Intel i3 వంటి ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ సరిపోతుంది. ఇవే అంశాలను ఆధారంగా చేసుకుని అందులో ఉండే రామ్, ఇక కీలకమైన హార్డ్వేర్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమికమైన అవసరాలకు 25 నుండి 30 వేల రూపాయల మధ్య లభించే entry-level ల్యాప్టాప్ సరిపోతుంది. శక్తివంతమైన అవసరాలకు మాత్రం 50 వేల నుండి లక్షన్నర రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

స్క్రీన్ పరిమాణం, బరువు

లాప్టాప్ స్క్రీన్ పరిమాణం అత్యంత కీలకమైనది. అధిక సమయం పాటు మీ లాప్టాప్ ని బయటకు మోసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు 13 లేదా 14 అంగుళాల ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ అధిక సమయం ఇంట్లో గాని ఆఫీసులో గాని పని చేసేటప్పుడు, గ్రాఫిక్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లయితే 15 అంగుళాల పరిమాణం కలిగిన ల్యాప్టాప్ అనువుగా ఉంటుంది. ల్యాప్టాప్ బయటకు ఎక్కువ తీసుకు వెళ్లాల్సిన సందర్భాల్లో దాని బరువు రెండు కేజీల కంటే ఎక్కువ ఉండకుండా జాగ్రత్త వహించండి.

కనెక్టివిటీ పరంగా

నేను సెలెక్ట్ చేసుకునే లాప్టాప్ కి ముఖ్యమైన అన్ని పోర్టులు తప్పనిసరిగా ఉండాలి. USB Type-Aతోపాటు USB Type-C పోర్ట్, LAN పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, HDMI లేదా Mini HDMI, micro SD కార్డ్ రీడర్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ లో ఉండే విధంగా చూడండి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

వేగంగా పనిచేయడానికి

ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు హార్డ్డిస్క్ కాకుండా SSD తప్పనిసరిగా లాప్టాప్ లో ఉండే విధంగా జాగ్రత్త వహించండి. దీనివలన విండోస్ బూటింగ్ చాలా వేగంగా పూర్తి కావటం మాత్రమే కాకుండా, మీ లాప్టాప్లోని అప్లికేషన్స్ వేగంగా ఓపెన్ అవుతాయి. అలాగే రామ్ విషయంలో కనీసం 8 జిబి ర్యామ్ ఉంటే మంచిది.

స్క్రీన్ రిజల్యూషన్ విషయానికొస్తే అధిక శాతం బడ్జెట్ ల్యాప్టాప్ట్‌లు 720p రిసల్యూషన్ మాత్రమే కలిగి ఉంటాయి, అయితే Full HD రిజల్యూషన్ ఉన్న ల్యాప్టాప్ అక్షరాలను మరింత స్పష్టంగా చూపిస్తుంది. Keypad మీద రాత్రి సమయాల్లో కూడా కీలు స్పష్టంగా కనిపించే విధంగా backlit ఉన్న మోడల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఎంత బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

Computer Era
Logo
Enable registration in settings - general