కొత్తగా LED Smart TV కొనాలనుకునేవారు తొందరపడి దేన్నిబడితే దాన్ని కొనడం కాకుండా అన్ని రకాలుగా మెరుగైన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పనితీరు పరంగా, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న అనేక LED smart tv మోడల్స్ రివ్యూ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.
ఇక్కడ మనం చెప్పుకుంటున్న Sony Bravia 65X7400H అనే మోడల్ 65 అంగుళాల అల్ట్రా హెచ్‌డి 4K కోవకు చెందినది. సోనీ సంస్థకు చెందిన ప్రొప్రైటరీ టెక్నాలజీ X-reality pro, శబ్దాన్ని వీలైనంత స్పష్టంగా అందించే Clear Audio plus టెక్నాలజీలు దీనిలో ఉపయోగించబడ్డాయి.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
Sony Bravia 65X7400H చూడడానికి చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ఒక మామూలు టీవీలా కాకుండా ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది. చాలా పలుచగా ఉండే అంచులు, టేబుల్ మీద అమర్చుకోవడానికి తగిన స్టాండ్‌ని ఇది అందిస్తుంది.
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
కనెక్టివిటీ సదుపాయాలు
3 HDMI పోర్టులు
2 USB పోర్టులు
1 RJ45 LAN పోర్ట్
1 ఆప్టికల్ ఆడియో ఔట్ పోర్ట్
1 RF ఏంటెన్నా
Sony Bravia 65X7400H డిస్‌ప్లే
మిగతా సంస్థలతో పోలిస్తే Sony TVల డిస్‌ప్లే అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ టీవీ విషయానికొస్తే, 65 అంగుళాల 4K UHD ప్యానల్ ఏకంగా 8 మిలియన్స్ పిక్సళ్లని అందించడం వల్ల, టీవీ మీద దృశ్యాలను చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. వాటికి జీవం పోసిన అనుభూతి కలుగుతుంది.
ఈ మోడల్‌లో Dolby Vision, HDR 10 సపోర్ట్ కలిగి ఉండటం వలన మరింత అద్భుతమైన దృశ్య నాణ్యత లభిస్తుంది. బ్రైట్నెస్ కూడా మిగతా మోడల్స్ కంటే చాలా ఎక్కువ లభిస్తుంది. బాగా వెలుతురు గా ఉన్న సమయంలో కూడా స్క్రీన్ పై దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇతర అంశాలు
గతంలో Sony టివిలలో Android ఆపరేటింగ్ సిస్టం ఉండేది కాదు. అయితే ఇటీవల వస్తున్న మోడల్స్ లో Android TV ఆపరేటింగ్ సిస్టమ్ అందించబడుతోంది. ఈ మోడల్‌లో కూడా Android TV లభిస్తుంది.
Netflix, Youtube వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ అప్లికేషన్లు ముందే ఇన్ స్టాల్ చేయబడి ఉండటంతోపాటు, వాటికంటూ రిమోట్ మీద ప్రత్యేకంగా బటన్ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా సులభంగా ఆపరేట్ చేసుకునే విధంగా ఇంటర్ఫేస్ రూపొందించబడింది.
USB ప్లగ్ అండ్ ప్లే సదుపాయం కలిగి ఉండటం వలన మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్‌ని నేరుగా టివికి కనెక్ట్ చేసుకుని అందులో కంటెంట్ చూడొచ్చు. లేదా ఫోన్ స్క్రీన్‌ని మిర్రర్ చేసుకోవచ్చు.
ఆడియో
Sony Bravia 65X7400Hలో రెండు స్పీకర్లు పొందుపరచబడి ఉంటాయి. 20W పవర్ ఔట్‌పుట్ వీటి ద్వారా లభిస్తుంది. సోని సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన clear audio plus టెక్నాలజీ వాడబడి ఉండటం వల్ల అద్భుతమైన శబ్ద నాణ్యత, rich bass, వేల్యూమ్ ఎంత పెంచినా కూడా మాట స్పష్టంగా వినిపించడం జరుగుతుంది. ఒక మాదిరి గదిలో సరిపడా శబ్ధం వస్తుంది. పెద్ద గది ఉంటే మాత్రం అదనంగా సౌండ్ బార్ అమర్చుకుని తగినంత loudness పొందొచ్చు.
అన్ని రకాలుగా రెండో ఆలోచన లేకుండా తీసుకోదగిన మోడల్ ఇది.
అద్భుతమైన 4K UHD డిస్‌ప్లే Tizen Smart TV OS ఆధారంగా పనిచేస్తుంది Samsung Smart Hub కనెక్టివిటీ కలిగి ఉంటుంది
Positive
ఆకర్షణీయమైన, ప్రీమియం డిజైన్
టివి చుట్టూ స్వల్పమైన అంచులు
పలు కనెక్టివిటీ ఆప్షన్లు
Negatives
కేవలం 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
మెరుగైన దృశ్యనాణ్యత కలిగిన డిస్‌ప్లేలను తయారు చెయ్యడంలో Samsung చాలాకాలంగా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న విషయం తెలిసిందే.
55 అంగుళాల పరిమాణం కలిగిన ఈ 4K UHD టివి రంగులను సహజసిద్ధంగా చూపిస్తుంది.
టీవీ వెనుక భాగంలో matte ఫినిషింగ్ కలిగిన ప్లాస్టిక్ కవరింగ్ లభిస్తుంది. మిగతా సాంసంగ్ టీవీ లకు భిన్నంగా ఈ QA55LS03TAKXXLలో అన్ని పోర్టులకి ప్రత్యేకంగా కనెక్షన్ బాక్స్ అందించడం ద్వారా కేబుల్స్ దాగి ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇలా అమరిక చేసుకుంటే, వాల్ మౌంట్ చేసుకున్న సందర్భంలో ఒక ఫోటో ఫ్రేమ్ గోడకు తగిలించిన అనుభూతి దీని ద్వారా కలుగుతుంది. ఈ కారణం చేత సాంసంగ్ సంస్థ దీనిని “The Frame” అనే పేరుతో కూడా పిలుస్తుంది. Samsung ఇప్పటి వరకు ఇండియాలో విడుదల చేసిన వారిలో చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా కనిపించే మోడల్ ఇది.
కనెక్టివిటీ సదుపాయాలు
4 HDMI పోర్టులు
2 USB పోర్టులు
1 AV ఇన్‌పుట్ పోర్ట్
1 RF ఏంటెన్నా పోర్ట్
1 RJ45 LAN పోర్ట్
1 ఆప్టికల్ ఆడియో ఔట్ పోర్ట్
డిస్ప్లే
Samsung QA55LS03TAKXXLలో 3840×2160 రిజల్యూషన్ కలిగిన 55 అంగుళాల 4K UHD ప్యానల్ అందించబడింది. భారీ మొత్తంలో పిక్సెల్స్ కలిగి ఉండటం వలన తిరుగులేని దృశ్య నాణ్యత దీంట్లో ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల ఒక ఫ్రేమ్ నుండి మరో ఫ్రేమ్‌కి కళ్ళ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా కదలిక ఉంటుంది.
HDR 10 సపోర్టు కూడా ఈ టీవీలో ఉంటుంది.
ఇతర అంశాలు
మామూలు WiFi సదుపాయంతో పాటు ఇందులో, బ్లూటూత్ లో ఎనర్జీ ప్రొటోకాల్ ఉపయోగించబడి ఉంటుంది. దీని ద్వారా తక్కువ విద్యుత్ వినియోగించుకునే విధంగా బ్లూటూత్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు.
Tizen ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే యూజర్ ఇంటర్ ఫేస్ దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. అన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. అదనంగా అవసరమైన వాటిని Samsung Store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆడియో
ఒక్కొకటి 20W సపోర్టు కలిగిన రెండు స్పీకర్లు దీంట్లో ఉంటాయి. వీటి నుండి తగినంత శబ్దం లభించడంతోపాటు, అది స్పష్టంగా కూడా ఉంటుంది. Bass ప్రత్యేకంగా పేర్కొనబడి లేకపోయినప్పటికీ ఆడియో క్వాలిటీ మాత్రం మెరుగ్గా ఉంటుంది.
ఒపీనియన్
Samsung QA55LS03TAKXXLని మార్కెట్లో లభిస్తున్న LED smart tvలలో బెస్ట్ మోడల్స్‌లో ఒకటిగా పరిగణించవచ్చు. మెరుగైన డిస్ప్లే క్వాలిటీ, కనెక్టివిటీ ఫీచర్లు దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
యాక్టివ్ HDR UHD 4K డిస్‌ప్లే స్మూత్‌గా, విభిన్నంగా ఉండే Web OS బాక్స్‌తో పాటు మాజిక్ మోషన్ రిమోట్
Positive
పలు రకాల కనెక్టివిటీ ఆప్షన్స్
నాణ్యమైన సౌండ్ ఔట్‌పుట్ క్వాలిటీ
సులభంగా ఉండే Web OS UI
Negatives
Web OS యాప్ స్టోర్ పరిపూర్ణంగా ఉండదు
LG 65UM7290PTDలో భారీ మొత్తంలో ఫీచర్స్ పొందుపరచబడి వుంటాయి.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
టీవీ చుట్టూ చాలా పలుచని అంచులతో ఇది ఆకర్షణీయంగా రూపొందించబడింది. మొత్తం హార్డ్వేర్ వెనకభాగంలో అమర్చబడి ఉండటం వలన వెనక వైపు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉండటం వల్ల లగ్జరీ ఫీల్ లభిస్తుంది.
కనెక్టివిటీ సదుపాయాలు
3 HDMI పోర్టులు
2 USB పోర్టులు
1 RJ 45 LAN పోర్ట్
1 ఆప్టికల్ ఆడియో పోర్ట్
1 AV ఇన్‌పుట్ పోర్ట్
డిస్‌ప్లే
55 అంగుళాలు ఈ 4K టివి HDR 10, HLG Pro వంటి వివిధ రకాల HDR modeలను సపోర్ట్ చేస్తుంది. ఈ కారణం చేత Netflix, ఇతర స్ట్రీమింగ్ సైట్ల ద్వారా HDR సర్టిఫైడ్ కంటెంట్ అద్భుతమైన దృశ్య నాణ్యతతో చూడొచ్చు.
IPS డిస్ ప్లే టెక్నాలజీ లో LG అగ్రగామిగా ఉంటుంది. 55 అంగుళాల పరిమాణం కలిగి ఉన్నప్పటికీ, గదిలో ఏ మూల నుండి చూసినా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. 50 Hz రిఫ్రెష్ రేట్ కలిగివున్నప్పటికీ, వీడియో ప్లేబ్యాక్ సమయంలోనూ వేగంగా కదిలే అంశాలు ఉన్నప్పుడు అంత స్మూత్ గా ప్లే అవుతుంది.
WebOS
గూగుల్ సంస్థకు చెందిన Android TV OSకి పోటీగా LG సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన టీవీ ఆపరేటింగ్ సిస్టం Web OS. ఈ ఆపరేటింగ్ సిస్టం చాలా తక్కువ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉన్న టివిలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అంతే కాదు ఇది వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్ కూడా అందిస్తుంది. టీవీ రిమోట్ బటన్‌లను తరచూ వాడాల్సిన పనిలేదు.
WebOSలో మల్టీటాస్కింగ్ సదుపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక పక్క లైవ్ బ్రాడ్ కాస్ట్ చూస్తూనే, టివిలో మరోపక్క సోషల్ మీడియా అకౌంట్లని ఛెక్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ టివి డ్యూయల్ బ్లూటూత్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం వల్ల ఎక్కువ రేంజ్ లభిస్తుంది.
ఆడియో
10W కెపాసిటీ కలిగిన రెండు DTS సర్టిఫైడ్ స్పీకర్లు ఈ టీవీలో లభిస్తాయి. మరింత మెరుగైన ఆడియో పొందాలంటే సౌండ్ బార్, లేదా ఎక్స్టర్నల్ స్పీకర్లు కొనుగోలు తీసుకోవచ్చు.
ఒపీనియన్
ఈ టీవీ ద్వారా ధరకు తగ్గ సదుపాయాలు లభిస్తున్నాయి. అద్భుతమైన దృశ్య నాణ్యత కలిగి ఉండే IPS 4K డిస్ప్లే, HDR సపోర్ట్, స్మార్ట్ కనెక్టివిటీ.. ఇలా అన్ని అంశాల పరంగా చూస్తే ఇది బెస్ట్ వేల్యూ ఫర్ మనీ అని భావించవచ్చు.
55 అంగుళాల భారీ పరిమాణం ఆండ్రాయిడ్ TV ఆపరేటింగ్ సిస్టమ్ లౌడ్‌గా ఉండే సౌండ్ ఔట్‌పుట్
Positive
చాలా పలుచని అంచులు ఉండే డిస్‌ప్లే
సహజసిద్ధమైన రంగులు కన్పిస్తాయి
ఇది బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది
Negatives
అంతర్గతంగా ఉండే picture modeలు అంత మెరుగ్గా లేవు.
Vu అనేది ముంబైకి చెందిన టీవి తయారీ కంపెనీ. ఇది బడ్జెట్ ధరలో అనేక సదుపాయాలు కలిగిన టీవీ లకు తయారు చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు మనం చూస్తున్న Vu Cinema Action ఆ సంస్థ తయారు చేసిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
అత్యంత నాణ్యమైన పాలికార్బోనేట్ ప్లాస్టిక్‌తో ఈ Vu టివి రూపొందించబడింది. టీవీ చుట్టూ అంచులు తక్కువగా ఉండటం వలన చూడడానికి ప్రీమియం లుక్ కనిపిస్తుంది. అన్ని రకాల పోర్టులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా టివి పక్క భాగాల్లో అమర్చబడ్డాయి.
డిస్ప్లే
3820×2160 పిక్సెళ్ల రిసల్యూషన్ కలిగిన 4K UHD డిస్ప్లే తో ఇది లభిస్తుంది. రంగులు సహజసిద్ధంగా ఉండటంతోపాటు, కాంట్రాక్ట్ లెవెల్ కూడా మెరుగ్గా ఉంటుంది. 400 nits బ్రైట్నెస్ లెవల్స్ ను ఇది అందిస్తుంది.
Vu Cinema Action 55LX టివి Android TV OS 9.0 ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, వాయిస్ అసిస్టెంట్ వంటి అన్ని రకాల గూగుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్‌లను ఈ టివిలో వాడుకోవచ్చు.
ఇతర వివరాలు
2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని ఈ టివి కలిగి ఉంటుంది. 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, 50W అవుట్‌ఫుట్ కలిగిన రెండు స్వీకర్ బాక్స్‌లు అందించబడతాయి.
అద్భుతమైన 43 అంగుళాల Full HD టివి బ్లూటూత్ కనెక్టివిటీ గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టివి
Positive
టివి డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది
మెరుగైన బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది
స్క్రీన్ చుట్టూ చాలా పలుచని అంచులు
ఆక్సిజెన్ ప్లే సపోర్ట్
Negatives
యూజర్ ఇంటర్‌ఫేస్ కొన్నిసార్లు కొద్ది ఆలస్యంగా రెస్పాండ్ అవుతుంది.
OnePlus సంస్థ బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అందుబాటులోకి తీసుకొచ్చిన మోడల్ ఇది.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ టీవీ ప్లాస్టిక్‌తో రూపొందించబడింది. ఇది మెరుగైన బిల్డ్ క్వాలిటీ అందిస్తోంది. రిమోట్ చాలా చిన్నదిగా ఉంటూ Netflix, Prime Video, Youtube వంటి పాపులర్ సర్వీసులకు షార్ట్ కట్స్ అందిస్తోంది. అలాగే రిమోట్ మీద ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ పొందుపరచబడింది. దీని ద్వారా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తీసుకోవచ్చు.
కనెక్టివిటీ సదుపాయాలు
2 HDMI పోర్టులు
2 USB పోర్టులు
1 RCA ఇన్‌పుట్
1 ఆప్టికల్ పోర్ట్
1 RJ45 LAN పోర్ట్
బ్లూటూత్
డిస్‌ప్లే
1920×1080 Full HD రిసల్యూషన్‌ని అందించే టివి ఇది. Full HDలో Gamma ఇంజిన్ నిక్షిప్తం చేయబడి ఉండడం వల్ల డిజిటల్ నాయిస్ రిడక్షన్, డైనమిక్ కాంట్రాస్ట్ లెవల్స్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
స్మార్ట్ ఫీచర్లు
OnePlus 43Y1 టివి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేయటం వల్ల గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే సర్వీసెస్, ఇతర గూగుల్ సదుపాయాలు లభిస్తాయి.
స్పీకర్లు
20W ఔట్‌పుట్ కలిగిన రెండు స్పీకర్లని ఇది అందిస్తుంది. ఇవి డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటాయి. మరింత మెరుగైన ఆడియో కావాలంటే సౌండ్ బార్ కొనుగోలు చేసుకోవచ్చు.
ఒపీనియన్
30 వేల లోపు మంచి టివి కొనాలంటే రెండో ఆలోచన లేకుండా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.