
Google Play Storeలో లభించే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తాయి. అందులో భాగంగా ప్రస్తుతం Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps వివరాలు ఇక్కడ చూద్దాం.
Hairy Letters
280 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ ఇప్పుడు ఫ్రీగా లభిస్తోంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అక్షరాలు శబ్దాలను గుర్తించే విధంగా ఇది మంచి లెర్నింగ్ అప్లికేషన్ గా పనికొస్తుంది. వేళ్ళతో లెటర్ షేపులను ట్రాక్ చేయడం, అక్షరాలను చిన్న చిన్న పదాలలోకి అమర్చడం, చిన్న పిల్లలు సులభంగా వాడే ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. Google Play Storeలో ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.