
ఒక ఏడాది పాటు Preview Offer, Welcome Offer, Happy New Year Offer అని free calls, sms, mobile data అందించిన తర్వాత.. Reliance Jioకి ఓ ధర్మ సందేహం వచ్చింది. అదేంటంటే.. “అన్నీ ఫ్రీగా వస్తున్నాయని SIM తీసుకున్న వాళ్లలో ఎంతమంది పే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు?” అన్నది!
అందుకే గత ఏడాది 99 రూపాయలు JioPrime subscription తీసుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రకటించింది. పోతే పోయింది 99 రూపాయలే కదా అని చాలామంది recharge చేసుకున్నారు. ఇప్పుడు మార్చి 31, 2018తో ఆ JioPrime Subscription ముగిసిపోబోతోంది. మీరు మార్చి 30, 2018న కొత్తగా Jio SIM తీసుకున్నా అది మార్చి 31కి Prime subscription ముగిసిపోతుంది.
ఇప్పటి వరకూ Prime subscription ఉన్న వారికి ప్రత్యేకమైన టారిఫ్, JioTV, JioMusic, JioCinema వంటి వివిధ apps ద్వారా 10 వేల రూపాయల విలువైన ఉచిత సేవలు అందించబడుతూ ఉన్నాయి. Prime subscription ముగిసిన తర్వాత లెక్క ప్రకారం వీటన్నింటికీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ప్రకారం Jio Prime subscriptionని Reliance Jio సంస్థ మరో ఏడాది పాటు కొనసాగించే అవకాశం ఉంది.