నవంబర్ 3న Micromax లేటెస్ట్ phones వస్తున్నాయి.. వివరాలు ఇక్కడ!

Micromax latest smartphones in India

Micromax సంస్థ భారతీయ మార్కెట్లో నవంబర్ 3వ తేదీన అనేక దేశీయ smartphone మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

In అనే బ్రాండ్ పేరు మీద ఈ మోడల్స్ విడుదలవుతాయి. నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఒక ప్రత్యేకమైన event ద్వారా ఇవి అందుబాటులోకి వస్తాయి. విడుదలకు ముందే ఈ సరికొత్త మైక్రోమ్యాక్స్ సిరీస్ కి సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. మీడియా టెక్ Helio ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే మోడల్ తో పాటు మీడియా టెక్ helio G 35 ఆధారంగా పనిచేసే మోడల్ కూడా లభిస్తుంది.

మీడియా టెక్ Helio g35 ఆధారంగా పనిచేసే మోడల్ లో 6.5 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే, 3gb ram, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ ఫోన్లో 5000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 7 వేల నుండి 15 వేల రూపాయల మధ్య ధర కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మళ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరింత ప్రభావవంతంగా అడుగు పెట్టడం కోసం Micromax సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా వాటిలో ఒకటి హైదరాబాద్ లో నెలకొని ఉండటం గమనార్హం. నెలకు ఇరవై లక్షలు ఫోన్లను తయారు చేసే సామర్థ్యం ఈ సంస్థ కలిగి ఉంది.

తాము తయారు చేసే ఫోన్ల ను దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకు వెళ్ళటం కోసం ఈ సంస్థ ఇప్పటికే స్థాపించబడి ఉన్న రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల సహకారం తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి మైక్రోమ్యాక్స్ కి దేశవ్యాప్తంగా పదివేలకు పైగా outlets, 1000 కి పైగా సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో నెలకొన్న పోటీ పరిస్థితుల్ని తట్టుకొని మైక్రోమ్యాక్స్ ఎంత మేరకు కొనసాగుతుందో కాలమే తేల్చి చెబుతోంది. ఏదేమైనా దేశీయ స్మార్ట్ఫోన్ కంపెనీ కోసం ఆసక్తిగా వేచి చూసే వారి కోసం కచ్చితంగా ఇది ఒక మంచి శుభవార్త గానే భావించాలి.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://chat.whatsapp.com/JMyfXBZdWl5BUR7SGHT3YY అనే గ్రూప్‌లో జాయిన్ అవండి. లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
      Computer Era
      Logo