బాలీవుడ్ నటి Aadhaar Card ఫోర్జరీ!

aadhaar forgery

ప్రముఖ బాలీవుడ్ నటి Urvashi Rautela ఆధార్ కార్డు ఫోర్జరీ చేయబడింది. యాదృచ్చికంగా ఆ విషయం ఆమె దృష్టికి వచ్చింది.

వివరాల్లోకి వెళితే మార్చి 27, 2018న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఊర్వశి పేరు మీద హోటల్ రూమ్ బుకింగ్ చేయబడింది. సాధారణంగా హోటల్ రూమ్ బుక్ చేసేటప్పుడు స్వీకరించే ఐడెంటిటీ కోసం బుక్ చేసిన వ్యక్తి ఆధార్ కార్డు సమర్పించారు. ఆ కార్డు మీద ఊర్వశి ఫొటో, పేరు పేర్కొనబడి ఉన్నాయి.

ఆ రూమ్ బుక్ చేసిన వ్యక్తి కేవలం నాలుగే నాలుగు గంటలు ఆ రూమ్ లో ఉన్నారు. సరిగ్గా అదేరోజు ఒక ఈవెంట్ లో పాల్గొనటానికి అదే హోటల్‌కి ఊర్వశి వెళ్లగా అక్కడి సిబ్బంది ఈ విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆమె తన మేనేజర్‌ని ఆరా తీయగా, ఆమె పేరు మీద ఎలాంటి బుకింగ్ చేయలేదని ఆమె పర్సనల్ మేనేజర్ స్పష్టం చేశారు. ఆమె ఆ హోటల్‌కి చేరుకోవడానికి కొద్దిసేపటి క్రితమే ఆ రూమ్ బుక్ చేసిన వ్యక్తి ఖాళీ చేసి వెళ్ళిపోయారు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

దాంతో బుకింగ్ చేసిన వ్యక్తి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీయగా మరో మోడల్, టివి నటి అయిన పారుల్ చౌధరి ఇలా ఫోర్జరీ చేయబడిన ఆధార్ వివరాల ఆధారంగా రూమ్ బుక్ చేసినట్లు తెలిసింది. వెంటనే ఊర్వశి పోలీసు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ పెద్దగా గుర్తు పట్టనిసెలబ్రిటీల ఫొటోలు,పేర్లు తగిలించుకుని నకిలీ ఆధార్ కార్డులు చెలామణి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆధార్ సంస్థ వర్చ్యవల్ ఐడి వంటి రక్షణాచర్యలను ప్రవేశపెట్టినప్పటికీ.. హోటల్ రూమ్ బుకింగ్ లాంటివి UIDAI సైట్‌తో అనుసంధానించబడి ఆధరైజేషన్ చేయబడవు కాబట్టి.. రూమ్ బుకింగ్ సమయంలో ఏదో ఒక ఐడీ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఇలా ఫోర్జరీ చేసిన వివరాలను సమర్పించే అవకాశముంది.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general