కరోనా టైమ్‌లో ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వాటిలో Pulse Oximeter కీలకమైంది. ఇది చర్మం ద్వారా ఒక కాంతి కిరణాన్ని శరీరంలోకి పంపించడం ద్వారా, ఆ కాంతిని బ్లడ్ టిష్యూలు absorb చేసుకున్నప్పుడు జరిగే మార్పులను బట్టి రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అన్నది అంచనా వేస్తుంది.
సాధారణంగా రక్తంలో ఆక్సిజెన్ శాట్యురేషన్ స్థాయి 95 శాతం వరకూ ఉండొచ్చు. 92 శాతం కంటే తగ్గితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా భావించి, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ నేపధ్యంలో మెరుగైన ఫలితాలు అందించే కొన్ని బెస్ట్ Pulse Oximetersల జాబితాను, వాటి పనితీరుని ఇప్పుడు వివరంగా చూద్దాం.
నిక్కచ్చిగా ఫలితాలు ఇచ్చే సెన్సార్లు ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీ సౌండ్ అలారమ్
Positive
తక్కువ బరువు కలిగి ఉంటుంది
IP22 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది
బ్రైట్‌గా ఉంటే, పెద్ద OLED డిస్‌ప్లే ఉంటుంది
Negatives
ప్రత్యేకంగా ఎలాంటి నెగిటివ్స్ లేవు
Dr. Trust అనేది అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ డివైజ్ ఉత్పత్తి కంపెనీ. ఈ సంస్థకి మన దేశంతో పాటు ప్రపంచంలో అనేక చోట్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి.
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
Dr. Trust Professional పల్స్ ఆక్సీమీటర్ హై-క్వాలిటీ ప్లాస్టిక్‌తో, అన్ని రకాలుగా మెరుగైన ఫిట్, ఫినిషింగ్‌ని కలిగి ఉంటుంది.
55 గ్రాముల బరువు మాత్రమే ఉంటే ఈ పల్స్ ఆక్సీమీటర్, మార్కెట్లో ఉన్న ఇతర మోడల్స్ కంటే చాలా తేలికగా ఉంటుంది. వేలుని పెట్టే ప్రదేశం పెద్దగా ఉండడం వల్ల చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అందరూ సౌకర్యంగా దీన్ని వాడుకోవచ్చు.
IP22 సర్టిఫైడ్ ఆక్సీమీటర్ కావడం వల్ల కొద్దిపాటి నీటి చుక్కలు పడ్డా, డస్ట్ పడ్డా లోపల ఉండే సర్క్యూటరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు.
Dr. Trust Professional ఫీచర్లు
Dr. Trust Professional కేవలం బ్లడ్ ఆక్సిజెన్ శాట్యురేషన్ స్థాయిలను గుర్తించడం మాత్రమే కాకుండా perfusion indel, heart rateలను కూడా చూపిస్తుంది.
శరీరంలో pulse strengthని తెలియజేయడానికి perfusion indexని ఉపయోగిస్తారు. ఇది కూడా అతి కీలకమైన పారామీటర్. అనేక పల్స్ ఆక్సీమీటర్లలో ఈ సదుపాయం ఉండదు.
అన్ని వైపులా తిప్పి వాడుకోగలిగే ఈ Dr. Trust Professional పల్స్ ఆక్సీమీటర్ పెద్ద ఫాంట్లతో కీలకమైన సమాచారాన్ని చూపించగలిగేలా ఉంటుంది. డివైజ్ మీద ఉండే బటన్లని ఆధారంగా చేసుకుని బ్రైట్‌నెస్ వంటివి మనకు నచ్చినట్లు మార్పిడి చేసుకోవచ్చు.
ఇతర వివరాలు
Dr. Trust Professional oximeter బాక్స్‌తో పాటు రెండు AAA బ్యాటరీలు అందించబడతాయి. అలాగే దీన్ని సురక్షితంగా పెట్టే పౌచ్, యూజర్ మేన్యువల్ లభిస్తాయి.
ఖచ్చితమైన ఫలితాలు పెద్ద ఫాంట్లతో కూడిన బ్రైట్ డిస్‌ప్లే క్యారీయింగ్ కేస్ అందించబడుతుంది
Positive
విభిన్నమైన డిజైన్
సౌకర్యవంతంగా ఉండే సిలికాన్ గ్రేడ్ ఫింగర్ మౌల్డ్
పైకి విన్పించే అలారమ్ నోటిఫికేషన్లు
Negatives
కొద్దిగా బల్క్‌గా ఉంటుంది
Hesley అనేది వేయింగ్ స్కేల్స్, మసాజర్లని తయారు చేసే ప్రముఖ హెల్త్‌కేర్, పర్సనల్ కేర్ కంపెనీ.
డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ
ABS ప్లాస్టిక్‌తో ఇది రూపొందించబడి ఉంటుంది. వేలిని పెట్టే ప్రదేశం మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేయబడింది. బ్లాక్, బ్లూ కలర్ కాంబినేషన్ వాడడం వల్ల ఇతర పల్స్ ఆక్సీమీటర్ల కంటే ఇది ప్రత్యేకంగా కన్పిస్తుంది.
క్రింద ఉండే బటన్ ద్వారా వివిధ మెనూల్లోకి వెళ్లి కావలసిన విధంగా అడ్జెస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు.
ఫీచర్లు
ఆక్సిజెన్ శాతాన్ని నిక్కచ్చిగా చూపించేలా ఇండస్ట్రీ ప్రమాణాలతో కూడిన సెన్సార్లు దీంట్లో పొందుపరచబడ్డాయి. దీనిలో బ్లడ్ ఆక్సిజెన్ స్థాయి మాత్రమే కాకుండా, రియల్-టైమ్ హార్ట్ రేట్, perfusion index కూడా చూపించబడుతుంది.
కంటి చూపు తక్కువ ఉన్న వాళ్లు కూడా అక్షరాలు స్పష్టంగా చూసేలా తగినంత సైజ్ ఫాంట్లు, బ్రైట్ LED డిస్‌ప్లేని ఇది కలిగి ఉంటుంది.
ఇతర వివరాలు
Hesley సంస్థ ఈ డివైజ్ విషయంలో ఎలాంటి IP రేటింగ్ ప్రకటించనప్పటికీ, నీటి చుక్కలను ఇది తట్టుకోగలుగుుతుంది అని అధికారికంగా తెలియజేస్తోంది. AAA బ్యాటరీల ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీని ఆదా చెయ్యడానికి 6-8 సెకన్లలో ఇది ఆఫ్ అయిపోతుంది.
ఆక్సిజెన్ శాతం, ఇతర అంశాలు బాగా తగ్గిపోతే నోటిఫై చేసేలా ఇన్‌బిల్ట్ అలారమ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది.