బ్యాంక్ OTPలూ, ఇతర SMSలు మరో రెండు రోజులు రాకపోవచ్చు!

TRAI new rules Bank OTP problem

బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఇతర అనేక రకాల కార్యకలాపాలకు మన smartphoneకి OTP వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అర్థరాత్రి నుండి దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ సేవలు, ఇతర అంశాలకు సంబంధించిన OTPలు, SMS మెసేజ్‌లు చాలా మందికి స్తంభించిపోయాయి.

దీనికి ప్రధాన కారణం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నియమ నిబంధనలు అందుబాటులోకి తీసుకురావడం! ఇటీవల దేశవ్యాప్తంగా అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, ఫిషింగ్ కాల్స్ వంటివి పెరుగుతూ ఉండడంతో అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసం TRAI 2019లో కొత్త బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ని అమలు పరచాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అది పెండింగ్లోనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా దానిని తప్పనిసరి చేయడంతో, ఆ సరికొత్త మార్పులను అమలుపరిచే ప్రయత్నంలో టెలికాం కంపెనీల SMS సేవలకు కొంత సమయం పాటు తీవ్ర విఘాతం కలిగింది. ఈ కొత్త నియమాల ప్రకారం ఇకమీదట వినియోగదారులకు SMSలను పంపించే కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఆధార్ వంటి సేవలు అందించే గవర్నమెంట్ ఏజెన్సీలు కొన్ని మెసేజింగ్ టెంప్లేట్లని తయారుచేసుకుని అందులో సూచించిన విధంగా మాత్రమే వినియోగదారులకు మెసేజ్లు పంపించవలసి ఉంటుంది.

ఈ కొత్త నియమాలు అందుబాటులోకి వచ్చిన దరిమిలా, తాత్కాలికంగా సేవలకు విఘాతం కలగడంతో బ్యాంకులు అతి ముఖ్యమైన మెసేజ్లను పంపించడానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల మీకు ఏదైనా సర్వీసుకి సంబంధించి SMS మెసేజ్ రాకపోతే ఆందోళన చెందకండి. కీలకమైన లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ OTPలు తప్పనిసరి అయినప్పటికీ.. కొత్త నియమాల వల్ల స్పామ్ చాలావరకు తగ్గిపోతుంది కాబట్టి తాత్కాలికంగా కలిగిన అసౌకర్యాన్ని భరించక తప్పదు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Computer Era
Logo
Enable registration in settings - general