భారతీయ phone కంపెనీలు Micromax, Karbonn, Lavaలకి ఇలా చేస్తే తిరుగేలేదు!

smartphone manufacturing in india lava karbonn micromax

భారతీయ smartphone మార్కెట్లో చైనా ఆధిపత్యం పోవాలంటే, కచ్చితంగా భారతీయ phone తయారీ కంపెనీలైన Micromax, Karbonn, Lava వంటివి అనేక అంశాల్లో పుంజుకోవలసి ఉంది.

చైనా ఫోన్ల పట్ల భారతీయ వినియోగదారుల్లో ప్రస్తుతం వ్యక్తమవుతున్న ఆందోళనలు ఈ భారతీయ కంపెనీలకు మాత్రం ఇప్పటికి ఇప్పుడు ప్రత్యక్షంగా ఉపకరించవు. అవి తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే అది ఎంత సవాళ్లతో కూడుకున్న పని. అన్నిటికంటే మొట్టమొదట ప్రస్తుతం పది వేల రూపాయల ధరలో Xiaomi, Realme, Oppo, Vivo సంస్థలకు పోటీగా మెరుగైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్న ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయాలి, అది కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. విడిభాగాలు చైనా నుండి దిగుమతి చేసుకునే ప్రస్తుత పరిస్థితుల్లో అది చెప్పుకునే అంత సులభమైన పని కాదు.

చైనా కంపెనీలు భారతీయ ఫోన్ మార్కెట్లో మార్చి 2020 నాటికి 81 శాతం వాటాను కలిగి ఉంటే, భారతీయ కంపెనీలు కేవలం 1 శాతం వాటా మాత్రమే కలిగి ఉండటం పరిస్థితిని తెలియజేస్తోంది. Micromax, Karbonn, Lava వంటి భారతీయ కంపెనీలు తిరిగి పుంజుకోవాలంటే మొట్టమొదట అవి మేధోసంపత్తి హక్కులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మిగతా అన్ని సంస్థలతో పోలిస్తే ఈ విషయంలో Lava కొంతవరకు మెరుగ్గా ఉంది. ఫోన్ డిజైన్ మరియు సామర్థ్యాల విషయంలో ఇది చాలా కాలంగా తనకంటూ పరిశోధనా సంస్థను కలిగి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ సంస్థకు చెందిన ఎగుమతులకు సంబంధించిన ఫ్యాక్టరీ, R&D యూనిట్, డిజైనింగ్ యూనిట్ చైనాలో ఉన్నాయి. వాటిని ఇండియాకు తరలించేందుకు ఆ సంస్థ ఈ సంవత్సరం 80 కోట్ల రూపాయల వరకూ వెచ్చించబోతోంది. అదేవిధంగా రాబోయే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ఇండియాకు తరలించడం కోసం ఆ సంస్థ 800 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టబోతోంది.

ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను వినియోగించుకోవడానికి Lava మరియు Karbonn సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఒక స్మార్ట్ ఫోన్ లో ఉపయోగించే డిస్ప్లే మొదలుకొని, చిప్‌లు, ఛార్జర్లు, కేబుల్స్, స్టోరేజ్ మాడ్యూల్స్ వంటి అన్ని రకాల విడిభాగాలను ఇండియాలో తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు మాత్రమే చైనా ఫోన్ తయారీ కంపెనీలకు ధీటుగా చవక ధరలకు భారతీయ మార్కెట్లో భారతీయ స్మార్ట్ఫోన్ కంపెనీలు ఫోన్లు విడుదల చేయటానికి సాధ్యపడుతుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo