
ఈ మధ్య Android, iOS ఆధారంగా పనిచేసే phoneలకి malware సమస్య బాగా పెరుగుతోంది. చాలామందికి Malware అనే పదం వినడమే తప్పించి హ్యాకర్లు దాన్ని ఎలా వాడతారన్నది తెలీదు.
Whatsappలో ఒకేసారి కొన్ని వందల photoలు పంపుకోవచ్చు అంటూ ఓ app ఉందనుకుందాం. లేదా Whatsapp కలర్స్ మార్చుకోవచ్చంటూ ఓ modded Whatsapp పేరిట ఓ .apk ఫైల్ కన్పించింది అనుకుందాం. చాలామంది వెనుకా ముందూ ఆలోచించకుండా అలాంటి వాటిని install చేసుకుంటూ ఉంటారు.
సహజంగా హ్యాకర్లు మొదట డార్క్ వెబ్‌లో రెడీమేడ్‌గా దొరికే malware codeని గానీ, లేదా తాము స్వంతంగా తయారు చేసుకున్న codeని గానీ రెడీగా ఉంచుకుంటారు. ఇప్పుడు internet నుండి Whatsapp, Facebook, మనం రోజూ ఆడే Candy Crush లాంటి రకరకాల గేమ్స్ apk ఫైళ్లని download చేసుకుని సులభంగా దొరికే టూల్స్‌ని వాడి Java ద్వారా రాయబడి ఉన్న ఆ apk ఫైళ్ల సోర్స్‌కోడ్‌ని డీకంపైల్ చేస్తారు.